Todays Top 10 News:
1. పటేల్ తరహాలో గాంధీ విగ్రహం: సీఎం
హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడీయాలజీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం తరహాలోనే బాపూ ఘాట్‌లోనూ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాంధీ వారసులుగా తాము బాపూఘాట్‌ను అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇక దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఎం ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. దక్షిణాదికి మోదీ అన్యాయం: రేవంత్
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి మేం ఓ రూపాయి పంపిస్తే.. మాకు 40 పైసలు తిరిగి పంపిస్తోందన్నారు. అదే ఉత్తరప్రదేశ్ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే వాళ్లకు 7 రూపాయలు వెనక్కి వస్తున్నాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. పెరుగుతున్న విమానాశ్రయాల కనెక్టివిటీ: రామ్మోహన్ నాయుడు
ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఎయిర్ కనెక్టివిటీ ఇండియాలో ఉండేలా ఎన్డీఏ ప్రభుత్వం ఇన్ ప్రా డెవలప్‌చేస్తోందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉడాన్ స్కీమ్ ద్వారా విమానాశ్రయాల మధ్య కనెక్టివిటీ కూడా పెంచుతామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రామ్మోహన్ నాయుడు కీల అంశాలపై మాట్లాడారు . విమానాయాన రంగాన్ని మధ్యతరగతి ప్రజలకు కూడా అనుకూలంగా ఉండేలా చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తమ హయాంలో అసలు ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే లైడిటెక్టర్ టెస్టుకు రావాలని సవాల్ చేశారు. ట్యాపింగ్ చేయించలేదని తామ చెబుతున్నామని రేవంత్ రెడ్డి కూడా వస్తే ఇద్దరికీ ఇక్కడే లైడిటెక్టర్ టెస్టులు నిర్వహించినా సిద్ధమేనని సవాల్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం: ర్యాపిడీ చీఫ్
ప్రస్తుతం ర్యాపిడో నెట్‌వర్క్‌లో 20 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉన్నారని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన... తమ సంస్థ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇది వారిని మోటివేటెడ్‌గా ఉంచుతుందని పేర్కొన్నారు. తాము డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ తీసుకోమని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. దక్షిణాదికి అన్యాయం ఊహాజనితమే: బీజేపీ
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి సీట్ల పరంగా అన్యాయం జరుగుతుందని విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తోసి పుచ్చారు. ఇదంతా ప్రాంతీయ పార్టీలు ఉద్దేశపూర్వక ప్రచారమని స్పష్టం చేశారు. సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత మధుయాష్కీ.. బై పొలార్, మల్టీ పోలార్ రాజకీయ అంశాలపై జరిగిన ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. డీ లిమిటేషన్ అనేది 2026లో రాజ్యాంగపరంగా తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ అని రఘునందన్ రావు గుర్తు చేశారు.
7. అందుకే ప్రశ్నలు అడుగుతా: ప్రకాశ్ రాజ్
జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు ఎందుకు అడగతారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్... సమాధానాలు చెప్పని ప్రశ్నలే అడుగుతానని క్లారిటీ ఇచ్చారు. మిగతా నటులు తమ సినిమాలతో, పనులతో బిజీగా ఉంటున్నారు. అయితే తాను మాత్రం అలా మౌనంగా ఉండలేనని, ఎందుకంటే తాను జీవించి ఉన్నానని ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన చేపలా ప్రవాహంలో తాను కొట్టుకుపోలేనని, అలలకు ఎదురీదే తత్త్వం తనదన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. అందుకే కోచింగ్: పుల్లెల గోపీచంద్
2001లో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచాక తానే గెలవగా లేనిది మిగతా వారు గెలవలేరా అనిపించిందని, అందుకే కోచింగ్‌ను ప్రారంభించానని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన... ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ముఖ్యం కాదని, ఆట మనల్ని ఏ విధంగా మార్చిందనేదే ముఖ్యమన్నారు. తన జీవితం మొత్తం బ్యాడ్మింటనే ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. మదర్సాలపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు
అతివృష్టి, అనావృష్టి రెండూ దేశానికి ప్రమాదమేనని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. ఫెడరలిజం వల్ల అన్ని రకాల పండుగలు, మతాలు, రాష్ట్రాలు ఒక గొడుకు కిందకు వస్తాయన్నారు. ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రాజకీయాల్లో మహిళల పాత్రపై డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి, కొంపెల్ల మాధవీలత, షామా మహమ్మద్, టీడీపీ నాయకురాలు జ్యోష్న తిరునగరి పాల్గొని ప్రసంగించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. అల్లు అర్జున్‌కి హైకోర్టులో భారీ ఊరట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బన్నీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..