AP CM Chandra Babu And Balakrishna Unstoppable Show Episode: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు జైలుకు వెళ్లిన ఎపిసోడ్‌ తెలుగు రాజకీయాల్లోనే చాలా ప్రత్యకమైంది. అరెస్టు నుంచి ఆయన విడుదల వరకు జరిగిన పరిణామాలు ఆసక్తిని రేపిస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జైల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ పీక్‌ సీన్‌గా చెప్పుకోవాలి. అసలు ఆ రోజు వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు. సడెన్ బయటకు వచ్చిన జనసేనానీ ప్రస్తుత డీసీఎం పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించడం వెనుక ఏం జరిగిందనే ఆసక్తి అందరిలో ఉంది. ఆ విషయాలను బాలకృష్ణతో పంచుకున్నారు చంద్రబాబు. ఆహాలో నిర్వహించే అన్‌స్టాపబుల్‌ షోలో చాలా ఆసక్తిరమైన సంగతులు రివీల్ చేశారు. 


చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఓ మర్చిపోలేని ఘటనగా ఉన్న జైలు జీవితం గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. తప్పు చేయకున్నా జైల్లో పెట్టారని అన్నారు. తప్పు చేయలేదని నిప్పులా బతికానని వివరించిన చంద్రబాబు తనను మానసికంగా కుంగదీసి ఫినిష్ చేయాలని అరెస్టు చేశారని గ్రహించినట్టు వెల్లడించారు. మానసికంగా కుంగి పోతే ప్రత్యర్థులు గెలిచినట్టు అవుతారని ధైర్యం కోల్పోకుండా ఉన్నట్టు వెల్లడించారు. 


ప్రజల కోసమే బతికిన తనకు ప్రజల మద్దతు ఉంటుందనే విశ్వాసంతో ఉన్నట్టు వెల్లడించారు చంద్రబాబు. ఆ ధైర్యం, నమ్మకం తనను మరోసారి సీఎం సీట్లో కూర్చునేలా ప్రజలు ఆశీర్వదించారని వెల్లడించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదని కక్ష సాధింపుల ప్రసక్తే లేదని తెలిపారు. ఎవరైనా దూకుడుగా మాట్లాడినా వారించే వాడినని గుర్తుచేశారు. గతంలో ఉన్న పార్టీలు, నాయకులు కూడా ఇలానే ఉండే వాళ్లను వివరించారు. 


కానీ గత ఐదేళ్లు కక్ష సాధింపుతోనే పాలన సాగిందని గతంలో ఎన్నడూ చూడని వ్యక్తిగత కక్షతో ఇష్టానుసారంగా పని చేశారని చంద్రబాబు తెలిపారు. తనని కూడా వ్యక్తగత కక్షతోనే అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని వివరించారు. ఆ రోజు జైలుకు వెళ్లినప్పుడు ఈ విషయాలు గురించే ఆలోచించానని తెలిపారు. ఆ టైంలో నైతిక స్థైర్యం కోల్పోతే ప్రమాదమని గ్రహించి గట్టిగా నిలబడ్డానని గుర్తు చేశారు. మరింత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలు చేసినట్టు పేర్కొన్నారు. 


అదే టైంలో జనసేనాని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చి ధైర్యంగా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు గతం కంటే చాలా ధైర్యం వచ్చిందని చెప్పానన్నారు. ఈ పరిస్థితుల్లో ఓటు చీలిపోకుండా చేస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేస్తుందని అన్నట్టు వెల్లడించారు. అలాంటప్పుడు కలిసి ఎందుకు పోటీ చేయకూడదనే ప్రతిపాదన తాను చేశానని.. దానికి పవన్ అంగీకరించడమే కాకుండా బీజేపీని కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారన్నారు. 


జైల్లో అలా మాట్లాడుకున్న మాటలే విజయానికి తొలి మెట్టుగా చంద్రబాబు వర్ణించారు. అరెస్టు కాకున్నా పొత్తు ఉండేదని కానీ ఆలస్యమయ్యేదన్నారు. అరెస్టు ఉదంతంతో ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. మనం ఎన్ని అనుకున్నా విధి రాసనట్టు జరగాల్సిందేనన్నారు. 


తాను జైల్లో ఉండగా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉన్నారని,, లోకేష్‌ను ఎటూ కదలనీయకుండా ప్రభుత్వం చేసిందని వివరించారు. తన అక్రమ అరెస్టుపై ప్రజలు పోరాడుతుంటే వారికి తన ఫ్యామిలీ నాయకత్వం వహించిందని తెలిపారు. ఎప్పుడూ రాజకీయాల కోసం బయటకు రాని భువనేశ్వరి రాత్రి పగలు ప్రజల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. 


తర్వాత మిగతా విషయాలపై చర్చ సాగింది. యువగళం పాదయాత్ర లోకేష్‌ రాజకీయ జీవితంలోనే టర్నింగ్ పాయింట్‌గా చంద్రబాబు వర్ణించారు. లోకేష్‌ పాదయాత్ర చేస్తాను అన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో, ఎంతకు తెగిస్తారో అని అనుమానపడ్డట్టు చెప్పుకొచ్చారు. తనకంటూ ప్రత్యేకత కావాలంటూ నిరూపించుకోవడానికి బయల్దేరి విజయం సాధించారని చంద్రబాబుకితాబు ఇచ్చారు.  


Also Read: మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు