Top 10 Headlines Today:  


కాంగ్రెస్ వ్యూహం


వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ కార్యక్రమం కూడా అక్కడా ఇక్కడా కాకుండా ఏకంగా ఇడుపుల పాయలోనే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తూండటం రాజకీయంగా సంచలనం సృష్టించేదే. నిజమో కాదో అధికారికంగా ప్రకటించేదాకా స్పష్టత లేదు కానీ.. నిజంగానే ఇలాంటి పరిణామం జరిగితే మాత్రం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతుందని అనుకోవచ్చంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వై ఏపీ నీడ్స్ జగన్ ?


ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ మరోసారి అధికారం సాధించేందుకు  ప్రచార ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది. గతంలో రావాలి జగన్ - కావాలి జగన్ అనే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయింది. అధికారం సాధించగలిగారు. ఇప్పుడు ఆ క్యాప్షన్ వర్కవుట్ కాదు.  అందుకే కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. వై ఏపీ నీడ్స్ జగన్ ? అనే క్యాప్షన్ తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఐ ప్యాక్ టీం ఎంతో మేధోమథనం చేసి.. ఏపీ లోని పూర్తి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి ఈ ప్రచార కార్యక్రమం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వైట్‌ హౌస్‌లో మోదీ


ప్రధానిమోదీకి వైట్ హౌస్ వద్ద అద్భుతమైన స్వాగతం లభించింది. న్యూయార్క్ పర్యటన ముగించుకుని వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, భారత రాయబారులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. మోదీ వాష్టింగ్టన్ చేరుకునే సరికి వర్షం పడుతుండగా..ఆ వర్షంలో తడుస్తూనే తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులను, ప్రవాస భారతీయులను మోదీ పలకరించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


వర్ష సూచన 


నైరుతి రుతుపవనాలు రాగల 2, 3 రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (జూన్ 21) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


క్రెడిట్ స్కోర్ పెంచే టిప్స్‌


మీ క్రెడిట్‌ స్కోర్ మీ ఆర్థిక స్థితిని, క్రెడిట్‌ బిహేవియర్‌ను సూచిస్తుంది. లోన్‌ కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు.. మీ క్రెడిట్‌ స్కోర్‌ను బట్టే మీ ఫైనాన్షియల్‌ స్టేటస్‌, రిపేమెంట్‌ బిహేవియర్‌ను బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. మీరు నమ్మమైన వ్యక్తా, కాదా; మీకు ఎంత లోన్‌ మంజూరు చేయవచ్చన్న విషయాన్ని క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే లెక్కగడతాయి. మంచి స్కోర్‌తో ఉంటే.. త్వరగా లోన్‌ రావడం, తక్కువ వడ్డీ రేటు సహా మరిన్ని చాలా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మరోవైపు, తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవాళ్లకు ఈ అవకాశాలను యాక్సెస్ చేయడం కష్టంగా మారుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


త్వరలో గ్రూప్‌ వన్ ప్రిలిమినరీ కీ  


తెలంగాణలో 503 'గ్రూప్‌-1' సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జూన్‌ 11న నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేవారంలో ఆన్సర్ కీ విడుదలయ్యే అవకాశముంది. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ముగియనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గుండ్రని గుడ్డు వంద కోట్లు 


కోడిగుడ్లు ఏ ఆకారంలో ఉంటాయి? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. ఓవెల్ షేప్ అని. ఏ కోడి గుడ్డు అయినా ఓవెల్ షేప్ లోనే కనిపిస్తుంది. కానీ 100 కోట్ల కోడిగుడ్లలో ఒక గుడ్డు మాత్రం పూర్తి గుండ్రంగా ఉంటుంది. అది ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ కోడి నుంచి వస్తుందో కూడా అంచనా వేయడం కష్టం. అనుకోకుండా ఒక జర్నలిస్టుకు సూపర్ మార్కెట్లో గుండ్రంటీ కోడిగుడ్డు కనిపించింది. ఇలాంటి గుడ్డు 100 కోట్లలో ఒకటే ఉంటుందని తెలుసుకొని, ఆమె ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే ప్రపంచం మొత్తం వైరల్ అయింది ఈ గుడ్డు. సాధారణంగా గుడ్డు ఖరీదు ఆరు రూపాయలు నుంచి 7 రూపాయలు ఉంటుంది. కానీ పూర్తి గుండ్రంగా ఉన్న ఈ గుడ్డు ఖరీదు మాత్రం 78 వేల రూపాయలు. ఇది వెంటనే అమ్ముడుపోయింది. ఈ గుడ్డును ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉన్న సూపర్ మార్కెట్లో కనుగొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వరుణ్‌ సందేశ్‌కు గాయాలు


ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన హీరోగా ‘ది కానిస్టేబుల్’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తూ వరుణ్ సందేశ్ కాలికి తీవ్ర గాయం అయింది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మాడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


క్రూయెల్‌గా విజయ్  పోస్టర్


మిళ హీరో విజయ్ నటిస్తోన్న ‘లియో’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో విజయ్ లుక్ చాలా క్రూయెల్‌గా ఉంది. ఆగ్రహంతో సుత్తితో విలన్ పళ్లు రాళ్లగొడుతున్నట్లుగా.. చాలా క్రూయెల్‌గా ఉంది. ఆ పోస్టర్‌లో ఉన్న దృవపు ఎలుగుబంటి విజయ్ పాత్రను ప్రతిబింబించేలా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా ‘విక్రమ్’ మూవీలోని రొలెక్స్ తరహాలోనే భయానకంగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ విజయ్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. అంతేగాక.. ఇందులో విజయ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో పండుగ చేసుకుంటున్నారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ అభిమానులను ఈ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేయడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పాక్ ఆటలు 


ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా జరుగబోయే  ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో  ఆడేందుకు   రోజుకో  కొర్రీ పెడుతూ అసలు ఆడతారో లేదో స్పష్టంగా చెప్పకుండా వ్యవహరిస్తున్న  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)‌పై  భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ), ఐసీసీ  ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా వేదికలను మార్చడం కుదరదని, సాలిడ్ రీజన్ లేనిదే  వాటిని మార్చే ప్రసక్తే లేదని  స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి