తెలంగాణలో 503 'గ్రూప్‌-1' సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జూన్‌ 11న నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేవారంలో ఆన్సర్ కీ విడుదలయ్యే అవకాశముంది. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ముగియనుంది.


రాష్ట్రంలో జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పునఃపరీక్షకు 2,33,248 మంది హాజరయ్యారు. గతేడాది అక్టోబరు 16న జరిగిన పరీక్షతో పోలిస్తే దాదాపు 55 లక్షల మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ఇమేజింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రిలిమనరీ పరీక్ష మాస్టర్‌ ప్రశ్నపత్రం, గ్రూప్‌-1 ప్రిలిమినరీ కీ టీఎస్‌పీఎస్సీ... వెబ్‌సైట్లో పొందుపరచనుంది. కీ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీ విడుదల చేయనుంది. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది. 


ALSO READ:


'గ్రూప్‌-1' పరీక్షను రద్దుచేయండి! హైకోర్టులో దాఖలైన పిటిషన్!
తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశించాలంటూ బుధవారం(జూన్‌ 21) హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆదిలాబాద్‌కు చెందిన బి.ప్రశాంత్‌ మరో ఇద్దరు అభ్యర్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం(జూన్‌ 22) విచారణ జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గతంలోనే నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్ష ముగిసిన తర్వాత తొలిసారి పిటిషన్ నమోదైంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


వెబ్‌సైట్‌లో ఏఎంవీఐ పరీక్ష హాల్‌టికెట్లు, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్ష హాల్‌టికెట్లను బుధవారం (జూన్ 21) టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏఎంవీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. హాల్‌టికెట్‌లో సూచించిన నిబంధనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలని కమిషన్ కోరింది. అభ్యర్థుల ప్రాక్టీసు కోసం వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్ లింకు అందుబాటులో ఉంది.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్‌-4' పరీక్షకు ఏర్పాట్లు పూర్తి, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో  'గ్రూప్‌-4' రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 1న రాతపరీక్ష నిర్వహించనుంది. గ్రూప్‌-4 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ వారాంతంలో అందుబాటులో ఉంచనున్నారు. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. మొత్తం 8,180 గ్రూప్‌-4 సర్వీసు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..