రోజుల్లో ఎప్పుడు ఏ వ్యాధి ఎటాక్ చేస్తుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. వంశపారపర్యంగా లేని వ్యాధులు కూడా ఇప్పటి తరానికి వస్తున్నాయి. అందుకు కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం అనేవి కుటుంబ చరిత్ర లేదా 60 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్లకే మధుమేహం వస్తున్న కేసులు చూస్తూనే ఉన్నాం. ఇక మూత్రపిండాల వ్యాధి కూడా అటువంటిదే. ఇది వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని గుర్తించి ఖచ్చితమైన పరీక్షలు చేయించుకోవడం ఇందుకు ఉన్న ఏకైక మార్గం.


చర్మం పొడిబారిపోవడం


ఆరోగ్యకరమైన మూత్రపిండాలు ఎర్ర రక్తకణాలను తయారు చేయడం, ఎముకలని ఆరోగ్యంగా ఉంచడం, శరీరం నుంచి వ్యర్థాలని తొలగించడం చేస్తుంది. రక్తంలో ఖనిజాల సరైన స్థాయిని నిర్వహించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మూత్రపిండాలు రక్తంలో ఖనిజాలు, పోషకాల మధ్య సమతుల్యతని కొనసాగించలేనప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి ఏర్పడుతుంది. ఇది ఎముకల వ్యాధి వచ్చేందుకు దోహడదపడుతుంది. పొడి, దురద చర్మాన్ని కలిగిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చర్మం తరచూ దురద పెట్టి ఇబ్బంది పెడుతుంది.


మూత్రపిండాల వ్యాధి కారణంగా వచ్చే చర్మ సమస్యలకి చికిత్స చేయడం కాస్త కష్టం. ఎందుకంటే అంతర్లీనంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి చికిత్స చేసి దాన్ని నయం చేస్తే తప్ప ఈ సమస్యలు తగ్గవు. కిడ్నీ ఆరోగ్యం మెరుగైతే చర్మం కూడా దురదని తగ్గిస్తుంది. ఎలాంటి క్రీములు రాసుకున్నా ఫలితం ఉండదు.


తరచూ మూత్ర విసర్జన


రాత్రిపూట తరచుగా తరచుగా మూత్ర విసర్జన మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది. మూత్రపిండ ఫిల్టర్లు దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన చేయాలనే కోరిక పెరిగిపోతుంది. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా మగవారిలో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ని కూడా సూచిస్తుంది.


కళ్ళు ఉబ్బడం


మూత్రపిండాల ఫిల్టర్ లో ఆగిపోకుండా ప్రోటీన్స్ మూత్రంలో నుంచి బయటకి వెళ్లిపోతాయి. కిడ్నీలు ప్రోటీన్ ని నిల్వ ఉంచుకోలేవు. దీని వల్ల కళ్ళు చుట్టు ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. నిద్ర సరిపోనప్పుడు లేదంటే ఎక్కువగా నిద్రపోయినప్పుడు కూడా కళ్ళు ఉబ్బడం జరగుతుంది. కానీ కిడ్నీ ఆరోగ్యం చెడిపోతున్నప్పుడు కూడా కళ్ళు ఉబ్బిపోయి కనిపిస్తాయి.


పాదాల వాపు


మూత్రపిండాల పనితీరు క్షీణించడం వల్ల శరీరంలో ఉప్పు నిలిచిపోతుంది. దీని వల్ల పాదాలు, చీలమండలు ఉబ్బిపోతాయి. కాళ్ళలో నీరు చెరినట్టుగా అనిపిస్తుంది. ఇదే కాదు దిగువ అవయవాల్లో వాపు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి లేదా సిరల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.


ఆకలి తగ్గిపోతుంది


ఎంత టైమ్ గడుస్తున్నా కూడా ఆకలిగా లేకపోవడాన్ని విస్మరించకూడదు. ఇది కూడా కిడ్నీ వ్యాధులని సూచించే మరొక లక్ష్యం. బలహీనమైన మూత్రపిండాల పనితీరుని ఇది సూచిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఎప్పుడూ అలసటగా ఉంటుందా? ఈ అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial