Garuda Purana: సనాతన ధర్మంలో గరుడ పురాణానికి ప్రత్యేక హోదా ఉంది. దీనిని 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ఇంట్లో గరుడ పురాణాన్ని పఠిస్తే మరణించిన వారి ఆత్మకు మోక్షం కలుగుతుందని విశ్వ‌సిస్తారు. గరుడ పురాణం మరణం, మరణానంతర పరిస్థితుల గురించి చెబుతుంది. ఇది మనకు స్వర్గం, నరకం, పితృ లోకాల గురించి కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. గరుడ పురాణంలోని నీతిసార అధ్యాయంలో ఇలాంటి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ఇది మానవులకు సరిగ్గా ఎలా జీవించాలో నేర్పుతుంది. గరుడ పురాణంలో తెలిపిన‌ ఈ విషయాలను అనుసరించడం ద్వారా దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు.


Also Read : ఈ ఆత్మలే దెయ్యాలు, ప్రేతాత్మలుగా మారుతాయి!


1. మీ భ‌విష్య‌త్ మీ చేతుల్లో
మనమందరం డబ్బు సంపాదించడానికి మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. అయితే ఈ డబ్బు సంపాదించే క్ర‌మంలో అందరూ విజయం సాధించ‌లేరు. ఒక వ్యక్తికి చాలా సార్లు అదృష్టం అనుకూలంగా లేకపోవడమే దీనికి కారణం. అటువంటి పరిస్థితిలో, అతను తన సొంత‌ పనిని నిర్ణయించుకోవడం ద్వారా భవిష్యత్తును సృష్టించుకోవాలి. మీరు నిజంగా జీవితంలో విజయం సాధించాలనుకుంటే, లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందాలనుకుంటే, ముందుగా పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం నేర్చుకోండి. లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లో నివసిస్తుందని అన్ని గ్రంధాలలో పేర్కొన్నారు.


2. శారీరక, పరిసరాల పరిశుభ్రత
పరిశుభ్రత అంటే కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే కాదు. మీ నివాస స్థలం పరిశుభ్రత కూడా. లక్ష్మీదేవి అనుగ్ర‌హం మీపై ఉండాలని మీరు కోరుకుంటే, ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రంగా ఉంచండి. మీరు మీ ఇంటిని మాత్రమే కాకుండా, మీ శారీరక పరిశుభ్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమం తప్పకుండా స్నానం చేసి, శుభ్రమైన, సువాసనగల దుస్తులు ధరించి మీ ఇష్ట‌దైవాన్ని పూజించండి. ఇలా క్రమం తప్పకుండా చేసే వ్యక్తికి దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. పరిశుభ్రత పాటించని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని నమ్ముతారు. అపరిశుభ్రమైన ప్రదేశంలో ప్రతికూలత  స్థిరపడుతుంది. ఆ ఇంటి సభ్యులు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.


3. గరుడ పురాణంలో మోక్షానికి మార్గం
గరుడ పురాణాన్ని వైష్ణవ పురాణం అని కూడా అంటారు. గరుడ పురాణం ఒక వ్యక్తిని విష్ణువు పట్ల భక్తి వైపు నడిపిస్తుంది, మోక్షానికి మార్గాన్ని చూపుతుంది. ఈ పురాణంలో చెప్పిన విషయాలన్నీ మొదట విష్ణువు గరుడునికి చెప్పాడు. అప్పుడు కశ్యప మునికి ఈ విషయాలు వివ‌రించారు. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు గరుడుడికి ఇచ్చిన సందేశం మనకు కనిపిస్తుంది. గరుడ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలు ఉన్నాయి.


Also Read : ఈ పనులు చేస్తే ఆర్థిక‌ సమస్యలు దరిచేరవు


గరుడ పురాణంలో చెప్పిన ఈ జ్ఞానాన్ని మనం అలవరచుకుంటే, మన జీవితం అదృష్టంతో నిండి ఉంటుంది. మీరు దురదృష్టంతో బాధపడుతుంటే, గరుడ పురాణంలో పేర్కొన్న ఈ ఆలోచనలు మిమ్మల్ని దాని నుండి విముక్తి చేసే శక్తిని కలిగి ఉన్నాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.