Garuda Puranam: హిందూ సంప్ర‌దాయంలో, మత గ్రంధాలు, వేదాలు, పురాణాలకు అత్యంత‌ ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి పవిత్ర‌మైన‌దే గరుడ పురాణం. ఇది అష్టాద‌శ‌ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు.  గరుడ పురాణంలో మరణం, స్వర్గం-నరకం, ఆత్మ ప్ర‌యాణం, మోక్షానికి సంబంధించిన అనేక విష‌యాల‌ను శ్రీ మ‌హావిష్ణువు త‌న వాహ‌నమైన గ‌రుత్మంతుడికి తెలిపాడు. పక్షిరాజైన గరుడుడు 
శ్రీ‌మహావిష్ణువును అడిగే ప్రశ్నల పరంపర, ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ‌ల సార‌మే గ‌రుడ పురాణం.


జనన-మరణాల‌తో పాటు జ్ఞానం, మతం, నైతికతకు సంబంధించిన అనేక ఆధ్యాత్మిక విషయాలను రహస్యాలను గరుడ పురాణం తెలియ‌జేస్తుంది. వీటిని పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు దరిచేరవు. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు సంప‌ద‌కు సంబంధించిన విషయాల గురించి కూడా వివ‌రించాడు. గరుడ పురాణంలోని ప్ర‌స్తావించిన ఈ అంశాల‌ను పాటిస్తే ఎలాంటి ఆర్థిక‌ సమస్యల‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.


Also Read : రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు!


గరుడ పురాణంలో ఆర్థిక‌ సంబంధిత సూచ‌న‌లు


1. అలాంటి వ్యక్తుల సంపద నాశనం
ఏ పేదవాడికి సహాయం చేయకుండా ఒక వ్యక్తి సంపద ఎప్పటికీ పెరగదని గ‌రుడ పురాణం స్ప‌ష్టం చేసింది. అలాగే దానధర్మాలు లేదా ధ‌ర్మం చేయని వ్యక్తి  సంపద కూడా అతని వద్ద శాశ్వతంగా ఉండదు. అలాంటి వారి సంపద త్వరలోనే క్షీణిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా అలాంటి వారిపై కోపించి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడానికి లేదా దాతృత్వం, మతపరమైన పనులు చేయడానికి మన వంతు కృషి చేస్తే ఎల్లప్పుడూ మంచిది.


2. అలాంటి సంపద వృథా
మీరు డబ్బును సరైన సమయంలో లేదా సరైన స్థలంలో ఖర్చు చేయకపోతే, లేదా మీ డబ్బు మీ కుటుంబ జీవితంలో ప్రయోజనాలను లేదా సౌకర్యాలను అందించకపోతే, అలాంటి సంపద మీ వద్ద ఉన్నప్పటికీ వృథా అవుతుందని గరుడ పురాణం చెబుతోంది. మనం ఖర్చు చేయాల్సిన సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలి. అలాంటి స‌మ‌యంలో ఖ‌ర్చు చేయ‌డానికి వెన‌బాటుత‌నాన్ని ప్రదర్శిస్తే అటువంటి సంపద మనకు ఉపయోగపడదు.


3. లక్ష్మీదేవికి కోపం వస్తుంది
మ‌హిళ‌ల‌ కంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. అలాంటి ఇళ్ల నుంచి ఎప్పటికైనా బ‌య‌ట‌కు రావాల‌ని ఆమె భావిస్తుంది. ఆడపిల్లలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ముందు ఇంటి ఆడ‌ప‌డుచుల‌ను గౌరవించడం నేర్చుకోవాలి. ఇది ఇంటి ఆడపిల్లలను గౌరవించడం మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి అమ్మాయిని తోబుట్టువులా భావించి గౌరవించడం అని అర్థం చేసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం ఆడ పిల్లలను గౌరవించకుండా సంపాదించిన డబ్బు ఎప్పటికీ ఉపయోగపడదు.


Also Read : ఈ సంకేతాలు ఎదుర‌వుతున్నాయా - అదృష్టం మీ ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్టే!


గరుడ పురాణం ప్రకారం, మనం పైన పేర్కొన్న పనులకు ఉపయోగించకుండా సంపద లేదా ధ‌నాన్ని పోగుచేసినా ప్రయోజనం లేదని చెబుతోంది. అలాంటి డబ్బు మనల్ని ధనవంతులను చేయదు. మన దగ్గర డబ్బున్నప్పుడు దాన్ని సామాజిక సేవకు వినియోగించాలని గరుడ పురాణం చెబుతోంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.