Stock Market Today, 16 May 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 48 పాయింట్లు లేదా 0.26 శాతం గ్రీన్ కలర్‌లో 18,451 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఎయిర్‌టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఆయిల్, జిందాల్ స్టీల్. ఈ కంపెనీల షేర్లపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
PVR ఐనాక్స్: మల్టీప్లెక్స్ చైన్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రెండింతలు పెరిగి రూ. 1,143 కోట్లకు చేరుకుంది.
కళ్యాణ్ జ్యువెలర్స్: 2022-23 నాలుగో త్రైమాసికంలో కళ్యాణ్ జ్యువెలర్స్ నికర లాభం రూ. 70 కోట్లుగా లెక్క తేలింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 72 కోట్లతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది.
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్: Q4FY23లో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్వతంత్ర నికర లాభం 84% పెరిగి రూ. 251 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 136 కోట్లుగా ఉంది.
ఫైజర్ ఇండియా: 2023 జనవరి-మార్చి కాలానికి ఫైజర్ ఇండియా నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 130 కోట్లకు చేరుకుంది, క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 126 కోట్లుగా ఉంది.
ప్రోక్టర్ & గాంబుల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 59 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 20% పెరిగింది.
సూర్యోదయ్ SFB: నాలుగో త్రైమాసికానికి రూ. 39 కోట్ల నికర లాభాన్ని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆర్జించింది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48 కోట్ల నష్టం వచ్చింది. రిపోర్టింగ్ కాలంలో నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 210 కోట్లుగా లెక్క తేలింది.
NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) స్వతంత్ర నికర లాభం మార్చి త్రైమాసికంలో 19% వార్షిక వృద్ధితో (YoY) రూ. 1,810 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీ 32% వృద్ధితో రూ. 3,295 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ప్రకటించింది.
ఆస్ట్రల్: జనవరి-మార్చి కాలంలో ఆస్ట్రల్ రూ. 206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 141 కోట్ల లాభం నుంచి బాగా మెరుగుపడింది. ఈ త్రైమాసికంలో ఆదాయం దాదాపు 8% పెరిగి రూ.1,506 కోట్లకు చేరుకుంది.
కోరమాండల్ ఇంటర్నేషనల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 246 కోట్ల నికర లాభాన్ని కోరమాండల్ ఇంటర్నేషనల్ మిగుల్చుకుంది. నాలుగో త్రైమాసికంలో ఈ సంస్థ ఆదాయం రూ. 5,476 కోట్లుగా ఉంది.
ఉత్తమ్ షుగర్ మిల్స్: ఉత్తమ్ షుగర్ మిల్స్ నికర లాభం మార్చి త్రైమాసికంలో 15% పెరిగి రూ. 70 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 61 కోట్లుగా ఉంది. సమీక్ష కాలంలో రూ. 527 కోట్ల ఆదాయం వచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.