ప్రధానిమోదీకి వైట్ హౌస్ వద్ద అద్భుతమైన స్వాగతం లభించింది. న్యూయార్క్ పర్యటన ముగించుకుని వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, భారత రాయబారులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. మోదీ వాష్టింగ్టన్ చేరుకునే సరికి వర్షం పడుతుండగా..ఆ వర్షంలో తడుస్తూనే తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులను, ప్రవాస భారతీయులను మోదీ పలకరించారు.
అక్కడి నుంచి వైట్ హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధమ మహిళ జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. మోదీని ఆత్మీయంగా పలకరిస్తూ వైట్ హౌస్ లోకి తీసుకువెళ్లారు. వైట్ హౌస్ అధికారికంగా మోదీ కోసం అఫీషియల్ డిన్నర్ ను ఏర్పాటు చేసింది.
కొద్ది సేపు ముగ్గురు నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. డిన్నర్ టైంలో ధూమ్ స్డూడియో నుంచి వచ్చిన డ్యాన్సర్‌లు, భారతీయ సంగీత కళాకారుల సంగీత విభావరి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా అధికారులు, ఇతర ముఖ్యులతో అధికారిక డిన్నర్ కార్యక్రమం ఉంటుంది.
డిన్నర్‌కు వెళ్లిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి 20వ శతాబ్ధంలో చేతితో తయారు చేసిన అమెరిన్ బుక్ గ్యాలరీని బైడెన్ దంపతులు అందజేశారు. వీటితోపాటు వింటేజ్ అమెరికన్ కెమెరాను కూడా బహుమతిగా ఇవ్వనున్నారు. జార్జ్ ఈస్ట్మాన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ రికార్డు కూడా ఇస్తారు. అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీకి సంబంధించిన హార్డ్ కవర్ పుస్తకం, రాబర్ట్ ఫ్రాస్ట్ మొదటి కవితా సంపుటి పుస్తకాన్ని గిఫ్టుగా ఇస్తారు.
వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి జోరు వానలో కూడా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... "వాషింగ్టన్ DC చేరుకున్నాను. భారతీయ సమాజం ప్రేమ, ఇంద్ర దేవుడి ఆశీర్వాదం ఈ రాకను మరింత ప్రత్యేకం చేశార" అని రాసుకొచ్చారు.