Top 10 Headlines Today:


29 తర్వాత చంద్రబాబు ఏం చేయబోతున్నారు?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో కనీస ప్రాథమిక ఆధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాలతో ఇచ్చిన మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులను 29వ వరకూ కొనసాగిస్తూ తర్వాత వాటినీ తొలగించారు. వీటిపై సీఐడీ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేసింది. విచారణకు వచ్చినా  బెయిల్ రద్దు చేయడం అనేది ఉండకకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చంద్రబాబునాయుడుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లేనా  ?. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


మార్పునకు కారణమేంటి?


తెలంగాణ ఎన్నికల్లో  అందరూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిచిందని దుష్ప్రచారం  చేస్తున్నారని బండి సంజయ్ బహిరంగంగానే  చెబుతున్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని సచ్చేది లేదని కేసీఆర్ కూడా బహిరంగసభల్లో అంటున్నారు. అసలు కాంగ్రెస్ గెలుపు అనే మాట రెండు పోటీ పార్టీల నుంచి రావడం ఆసక్తికరమే. ఆరు నెలల కిందట రేసులో లేదనుకున్న కాంగ్రెస్ ఇలా మార్పు చెందడం అనూహ్యమే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి


పైబర్ నెట్ కేసులో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో వివిధ ఆస్తులు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. సీఐడీ ఆస్తుల అటాచ్‌కు  హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తుల అటాచ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు  ఏడు స్థిరాస్థులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


రూ.752 కోట్ల విలువైన ఆస్తులు జప్తు


నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు రూ.752 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు కాంగ్రెస్‌కు చెందిన ఏజేఎస్, యంగ్ ఇండియన్‌లకు చెందినవి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్, లక్నోలోని నెహ్రూ భవన్, ముంబయిలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి యంగ్ ఇండియన్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించిన కంపెనీకి చెందిన రూ.90 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కర్నె శిరీష సోదరుడిపై దాడి 


ఎన్నికల ప్రచారం (Telangana Elections 2023)లో నిన్న మొన్నటివరకూ బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులపై అక్కడక్కడా దాడులు జరిగాయి. తాజాగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష (Barrelakka Karne Sirisha) ఎన్నికల ప్రచారంపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బర్రెలక్క (శిరీష) సోదరుడిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొందరు ఉద్యోగార్థులు శిరీషకు మద్దతు తెలిపి ఆందోళనకు దిగారు. తాము ఏం పాపం చేశామని, ఏం తప్పు చేశామని మాపై దాడి చేస్తున్నారంటూ బర్రెలక్క కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణలో మరోసారి మోదీ టూర్


తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 25వ తేదీన మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్ లో బీజేపీ నిర్వహించనున్న సభల్లో, ఈ 27న మహబూబాబాద్, కరీంనగర్ లో బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్ షో లో మోదీ పాల్గొంటారని పీఎంఐ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రాహుల్ సెటైర్లు


భారత్(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World cup) ముగిసి రెండు రోజులైంది. అయినా సెమీస్(Semi-Finals) వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా(Team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు.  మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Kohli), మహ్మద్ సిరాజ్(Siraj) కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి  గల కారణంపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ(Pm Modi) ఒక చెడు శకునమని అన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రానా నాయుడు అప్‌డేట్


తెలుగులో విక్టరీ వెంకటేష్ ఇమేజ్ గురించి తెలిసింది. ఆయనకు ఫ్యామిలీ మ్యాన్ అనే ముద్ర ఉంది. కుటుంబ ప్రేక్షకులు, మరి ముఖ్యంగా మహిళలలో వెంకీ అభిమానులు ఎక్కువ వాళ్ళందరూ రానా నాయుడు వెబ్ సిరీస్ చూసి షాక్ అయ్యారు. వెంకటేష్ నటించిన ఒకే ఒక్క కారణంతో కుటుంబం అంతా కలిసి టీవీలో వెబ్ సిరీస్ ప్లే చేసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్లకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. అడల్ట్ సీన్లు, బూతు డైలాగులు వెంకీ అభిమానులకు నచ్చలేదు. దాంతో తెలుగులో ట్రావెల్స్ విపరీతంగా వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


'సలార్' క్రేజ్‌


సౌత్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'సలార్'(Salaar) మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. మూవీ ట్రైలర్ కు సంబంధించి మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు వెల్లడించారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో రావలసిన ఈ మూవీ పలు అనివార్య కారణాలతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 కు షిఫ్ట్ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నువ్వే మా ఛాంపియన్


భారత్(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) ముగిసి రెండు రోజులైంది. అయినా సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా( team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు.  మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి