Karthika Masam Upavasam Significance:  ఏడాదంతా ఎన్నో పండుగలు. వినాయక నవరాత్రులు, శరన్నవరాత్రుల సందడి తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు సందడి ఉంటే.. కార్తీకమాసం మొత్తం ప్రతి రోజూ పండుగతో సమానమే. సూర్యోదయానికి ముందే స్నానాలు, పూజలు, వ్రతాలు, దానాలు , ఉపవాసాలు, వనభోజనాలు  ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. ఈ నెల రోజులూ చేసే పూజలకు భారీగా వెచ్చించాల్సిన అవసరం లేదు. కావాల్లిందల్లా నియమం, మనపై మనకు నియంత్రణ అంతే. అలాంటి నియమంలో ఒకటి ఉపవాసం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని `కార్తీకపురాణం` చెబుతోంది. మరికొందకు ఏకాదశి, పౌర్ణమి రోజుల్లోనూ ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం అనేది భగవంతుడి కోసమే అనుకుంటే పొరపాటే...ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం..


Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!


జీర్ణవ్యవస్థకు వారానికోసారి సెలవు
ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో అలాగే మన జీర్ణవ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు సెలవు ప్రకటించమని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. వారానికి ఓరోజు ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇవ్వడమే. పైగా నిత్యం తీసుకునే ఆహారం జీర్ణించుకునేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. తిన్న వెంటనే మగతగా అనిపించడానికి కారణం కూడా ఇదే. అలా కాకుండా ఒక రోజంతా శరీరాన్ని తన మానాన వదిలేస్తే రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరం మూలమూలన ఉన్న దోషాలను ఎదుర్కొని  అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది.


Also Read: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!


లంకణం పరమౌషధం 
శరీరానికి తనకు తానుగా స్వస్థత పరచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే దానిని ఎదుర్కొనే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. వెంటనే మందులు వేసేసుకుంటున్నారు . కానీ అప్పట్లో పెద్దలు లంకణం పరమౌషధం అంటూ.. ఉపవాసం ఉండేవారు. 


Also Read: మీ రాశిప్రకారం కార్తీకమాసంలో మీరు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇదే!


ఉపవాసం మానసిక ఔషధం
ఉపవాసం శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా ఎంతో మంచి చేస్తుంది. ఎందుకంటే  మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్నీ, మనసుని ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఔషధం! విపరీతమైన కారం తింటే ఒకరకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరోరకమైన ఆలోచనలుంటాయి. మసాలా ఆహారం తీసుకుంటే వచ్చే ఆలోచనలు వేరు. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తల్చుకునేందుకు, అన్ని మతాలవారూ ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు  భగవన్నామస్మరణ తప్ప మరో ఆలోచన రాదు. అందుకే కార్తీకమాసం మొత్తం నిత్యం ఒకపూట తినేవారు కొందరు, ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరు, ఏకాదశి-ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు . ఏదీ కుదరకపోతే కనీసం ఒక్క సోమవారమైనా ఉపవాసం ఉండాలని చెబుతారు. 


Also Read: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు దేనికి సంకేతం - ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!


ఈ నెలలోనే ఉపవాసం ఎందుకు
ఉపవాసాల కోసం కార్తీకమాసాన్నే ఎందుకు ఎందుకుంటారంటే  బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది.  చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు శక్తి అవసరం అవుతుంది. కానీ కార్తీకమాసంలో ఉష్ణోగ్రతలు , చలి రెండూ సమానంగా ఉంటాయి.  ఇలాంటి సమయంలోనే శరీరాన్ని అదుపుచేయాలంటారు. అందుకే ఈ నియమాలన్నీ...