తెలుగులో విక్టరీ వెంకటేష్ ఇమేజ్ గురించి తెలిసింది. ఆయనకు ఫ్యామిలీ మ్యాన్ అనే ముద్ర ఉంది. కుటుంబ ప్రేక్షకులు, మరి ముఖ్యంగా మహిళలలో వెంకీ అభిమానులు ఎక్కువ వాళ్ళందరూ రానా నాయుడు వెబ్ సిరీస్ చూసి షాక్ అయ్యారు. వెంకటేష్ నటించిన ఒకే ఒక్క కారణంతో కుటుంబం అంతా కలిసి టీవీలో వెబ్ సిరీస్ ప్లే చేసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్లకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. అడల్ట్ సీన్లు, బూతు డైలాగులు వెంకీ అభిమానులకు నచ్చలేదు. దాంతో తెలుగులో ట్రావెల్స్ విపరీతంగా వచ్చాయి.


రానా నాయుడు వెబ్ సిరీస్ మీద తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వెంకటేష్ వరకు వెళ్ళింది. దాంతో రెండో సీజన్ విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నారు. సైంధవ సినిమాలో పాట విడుదల కోసం ఓ కాలేజీకి వెళ్లిన ఆయన ఆ విషయాన్ని చెప్పుకొచారు.


పెద్దోళ్లు 'ఏంట్రా అలా చేశావ్'!? అన్నారు! కానీ...
Will there be part 2 of Rana Naidu: 'రానా నాయుడు' రెండో సీజన్ గురించి ఓ స్టూడెంట్ ప్రశ్నించగా... ''వెళుతున్నా అమ్మా! జనవరి నుంచి స్టార్ట్ చేస్తా! నాగా నాయుడు మామూలోడు కాదు.  ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసేశారు. ఇప్పుడు మళ్లీ తీయమంటున్నారు. అయితే... ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఏమో 'ఏంట్రా నువ్వు అలా చేశావు' అన్నారు. మీ కుర్రవాళ్ళు ఏమో అందరూ చూసేశారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను. 'రానా నాయుడు' ఫస్ట్ సీజన్ చూసి మనవాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. ఏం పర్లేదు... ఈసారి చాలా చక్కగా ఉంటుంది. జాగ్రత్త పడతా. కాకపోతే కొంచెం కొంటెగా, అల్లరిగా ఉంటుంది'' అని చెప్పారు. 


వెంకటేష్ మాటలను బట్టి... రెండో సీజన్ తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని అర్థం అవుతోంది. అడల్ట్ సీన్లు, బూతు డైలాగులు చాలా వరకు తగ్గుతాయని చెప్పవచ్చు. జనవరి నుంచి ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి వెంకటేష్ అండ్ రానా రెడీ అవుతున్నారు. అదీ సంగతి! 



తండ్రీ కొడులుగా బాబాయ్ అబ్బాయ్!
Is Rana Daggubati and Venkatesh related? : 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే... నిజ జీవితంలో బాబాయ్, అబ్బాయ్ అయినటువంటి విక్టరీ వెంకటేష్, ఆయన సోదరుడు - నిర్మాత సురేష్ బాబు కుమారుడు రానా కలిసి నటించారు. డిజిటల్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. హాలీవుడ్ వెబ్ సిరీస్ 'రే డొనోవన్' ఆధారంగా... మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు, కొన్ని చేర్పులతో తీశారు. దీనికి కరణ్ అన్షుమన్,  సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. 


Also Read 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?


యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన 'రానా నాయుడు'లో రానా దగ్గుబాటి బి భార్యగా సుర్వీన్ చావ్లా నటించారు. గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. తెలుగును పక్కన పెడితే... హిందీ, విదేశీ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది.    


Also Read పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?