Top 10 Headlines Today:


గగన్‌యాన్‌లో తొలి అడుగు


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గగన్ యాన్ మిషన్ మొదటి పరీక్షను ఉదయం 8 గంటలకు నిర్వహించాలని భావించారు. అయితే సాంకేతిక కారణాలతో కౌంట్‌డౌన్‌ను అరగంట పొడిగించారు. అంటే అరగంట ఆలస్యంతో ప్రయోగం ప్రారంభంకానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కేటీఆర్ , కవితలు ఎన్నికల బాధ్యత తీసుకున్నారా!


భారత రాష్ట్ర సమితిలో  కేటీఆర్ , కవితలు ఎన్నికల బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ప్రతీ రోజు అత్యధిక సమయం పార్టీ కోసం కేటాయిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచార సభల్లో పాల్గొనడం, అసంతృప్తి ఉన్న నేతల్ని  బుజ్జగించడం, పార్టీలో చేరికల్ని ప్రోత్సహించడమే కాదు ఇతర పార్టీల నేతలకు చురుకుగా కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ వర్క్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు కానీ.. మిగతా మొత్తం కేటీఆర్, కవితలే విస్తృతంగా  పర్యటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ అమలు బిల్లుకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో జీపీఎస్ బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జీపీఎస్ బిల్లు తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పంపిన జీపీఎస్ బిల్లుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో బేసిక్ శాలరీలో 50 శాతం పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ చట్టం అమలు కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జగన్ 


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ అభ్యర్థి జగన్‌ మోహన్‌రావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో జగన్ విజయం సాధించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎట్టకేలకు శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173 ఓట్లు ఉండగా 169 ఓట్లు పోలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఉమ్మడి పోరు 


చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలవడం ఆలస్యమవుతోంది. స్కిల్ కేసులో ఏ 37 అయినప్పటికీ..   ఆయన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరో వైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల ఎనిమిదో తేదీన రావొచ్చని చెబుతున్నారు.  మరో వైపు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్  వెకేషన్ బెంచ్ మీదకు వెళ్లింది.   అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. టీడీపీ, జనేసన సంయుక్తంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నయి.  టీడీపీ - జనసేన తొలి సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారు చేసుకున్నారు.  ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గుడ్‌ న్యూస్‌


ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అన్ని విభాగాల నుంచి మరోసారి ఖాళీల వివరాలను తెప్పించుకున్న జీఎడీ, పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గృహలక్ష్మి పథకంపై స్టే


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంపై రాష్ట్ర హైకోర్టు (TS High Court ) స్టే విధించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేయడంపై కోర్టు శుక్రవారం స్టే విధించింది. అక్కడ గిరిజనేతరులకు ఇండ్లు కట్టుకునేందుకు సాయం చేస్తున్నారని ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్డ్‌ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని కోర్టును ఆశ్రయించారు. సాయిబాబు పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం (Gruhalahakshmi Scheme) అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 6కి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నెదర్లాండ్స్‌తో శ్రీలంక ఢీ


ప్రపంచకప్‌లో 19 వ మ్యాచ్‌లో శనివారం నెదర్లాండ్స్‌తో శ్రీలంక కీలకమైన మ్యాచ్‌ ఆడనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌... సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలతో ఉన్న శ్రీలంకకు చాలా కీలకమైంది. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. నెదర్లాండ్స్ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇచ్చి ఆత్మివిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో లంకకు షాక్ ఇవ్వాలని డచ్‌ జట్టు భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ శ్రీలంక ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే లంక సెమీస్‌ ఆశలు దాదాపుగా మూసుకునిపోయినట్లే. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో లంక ఉంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన నెదర్లాండ్స్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లతో పాయింట్ల ఎనిమిదో స్థానంలో ఉండగా...శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్లు లేకుండా పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అగ్ర శ్రేణి జట్ల మహా సమరం


ప్రపంచకప్‌లో అగ్ర శ్రేణి జట్ల మహా సమరం ప్రారంభమైంది. శనివారం డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తమ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ తిరిగి జట్టులోకి రావాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటోంది. ఈ రెండు జట్లు.. పసికూనల చేతిలో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. ఇంగ్లాండ్‌ను అఫ్ఘానిస్థాన్‌ మట్టికరిపించగా... దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాక్‌ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు 428 సాధించిన ప్రొటీస్‌... ధర్మశాలలో నెదర్లాండ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఢిల్లీలో అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కూడా ఓడిపోయింది.  ఈ షాక్‌ల నుంచి కోలుకుని మళ్లీ గాడినపడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పసికూనల చేతిలో పరాజయం పాలైన ఈ రెండు జట్లు గెలుపుతో సెమీస్‌ వైపు బలంగా అడుగు వేయాలని భావిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్‌లు తలపడగా... బ్రిటీష్‌ జట్టు నాలుగు మ్యాచుల్లో... సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలుపొందాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కల్ట్‌ కాంబో రిపీట్


ఈ సంవత్సరం జులై నెలలో వచ్చిన ‘బేబి’ (Baby Movie) ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను ‘బేబి’ సాధించింది. భారీ వసూళ్లతో పాటు గట్టి ఇంపాక్ట్ కూడా చూపించింది. ఇప్పుడు ‘బేబి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరో హీరోయిన్లుగా ‘బేబి’ నిర్మాత ఎస్‌కేన్, దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి