TS High Court  on Gruhalahakshmi Scheme:
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంపై రాష్ట్ర హైకోర్టు (TS High Court ) స్టే విధించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేయడంపై కోర్టు శుక్రవారం స్టే విధించింది. అక్కడ గిరిజనేతరులకు ఇండ్లు కట్టుకునేందుకు సాయం చేస్తున్నారని ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్డ్‌ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని కోర్టును ఆశ్రయించారు. సాయిబాబు పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం (Gruhalahakshmi Scheme) అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 6కి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు.