సెలబ్రేటీల నుంచి నార్మల్ పీపుల్​ వరకు ఇప్పుడు విడాకులే హాట్​ టాపిక్. జనరేషన్ అప్​డేట్​ అవ్వడం వల్లనో.. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉండడం వల్లనో.. ఈ మధ్య ఎక్కువమంది విడిపోతున్నారు. ఎన్నేళ్లు రిలేషన్​లో ఉన్నా.. దానికి ఫుల్ స్టాప్​ పెట్టి.. ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. ఇద్దరి మధ్య కారణాలను వేలెత్తి చూపుతూ విడిపోవడం ఒక ఎత్తు ఐతే.. ఇద్దరూ కూర్చొని మ్యూచువల్​గా మాట్లాడుకుని మరి విడిపోతున్నారు. ఒకరినొకరు కలిసి ఉండడానికి అర్థం చేసుకోవడానికి బదులుగా విడిపోవడానికి గల కారణాలను అర్థం చేసుకుని హ్యాపీగా విడిపోతున్నారు. 



మీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నా సరే.. సంబంధం ఎటూ ముందుకు వెళ్లట్లేదని అక్కడితో ఆపేస్తే ఇంక మీ ప్రేమకు అర్థమేముంది. ఈ జనరేషన్​లో లవ్ స్టేజ్​లోనే విడిపోయే వారే ఎక్కువ. వారి స్నేహాన్ని కొనసాగిస్తూ.. ప్రేమకు మాత్రం బాయ్ చెప్పేస్తున్నారు. అయితే ఇలా పర్మినెంట్​గా విడిపోవడానికి బదులుగా మీరు మీ రిలేషన్​కి స్మాల్​ బ్రేక్​ ఇవ్వండి. దీనివల్ల మీ గురించి ఎదుటివ్యక్తికి.. వారి గురించి మీకు మరింత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏదో గొడవైంది కదా అని వెంటనే విడిపోవడం కాకుండా.. ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకైనా మీ రిలేషన్​ను గౌరవించి ఓ ఛాన్స్ ఇవ్వండి. 



మీ రిలేషన్​ని దూరం చేసుకోవడం కంటే.. బ్రేక్​ తీసుకుని మళ్లీ కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు తెలుసా? బ్రేక్​ తీసుకున్నాక కూడా మీ రిలేషన్ వర్క్​ అవుట్ అవ్వదనిపిస్తే అప్పుడు మీరు పూర్తిగా తెగ్గొట్టేసుకోవచ్చు. అయితే బ్రేక్ తీసుకునే సమయంలో మీరు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఇచ్చిన బ్రేక్​కు ఓ అర్థం.. పరమార్థం ఉంటుంది. 


బ్రేక్​ ఎప్పుడు తీసుకోవాలంటే..


రిలేషన్​లో బ్రేక్​ తీసుకోవడం సరైనదా? లేదా అని చాలా మంది ఆలోచిస్తారు. విడిపోవడం కంటే ఇది చాలా మంచి నిర్ణయమే అవుతుంది. అయితే మొత్తానికి విడిపోవడంపై ఓ క్లారిటీ వస్తుంది. లేదా కలిసి ఉండేందుకు పలు కారణాలు దొరుకుతాయి. ఈ బ్రేక్​ టైమ్​లో ఎవరి వ్యక్తిగత జీవితాలపై వారు దృష్టి పెట్టే అవకాశం ఎక్కువగా దొరుకుతుం ది. కాబట్టి అది ఫ్యూచర్​లో వారికి కేరీర్​ పరంగా అయినా మంచే చేస్తుంది. బ్రేక్​ తీసుకోవాలా వద్దా అనే ఆలోచన మాత్రం ఎక్కువ కాలం ఉండేలా చూసుకోకండి. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్ది మీ బంధం బలహీనపడిపోతుంది. అది పూర్తిగా విడిపోయేందుకు దారి తీస్తుంది. 


వాటి మీద ఫోకస్ చేయండి..


విరామం తీసుకోవడం వల్ల మీ ప్రాధాన్యతలు, జీవిత లక్ష్యాలు గుర్తించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. కాబట్టి మీ గోల్స్​పై ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చు. కొన్నిసార్లు మీ గోల్స్ రీచ్​ అవ్వడానికి అవతలి వ్యక్తి మీకు అడ్డుగా ఉన్నారు అనిపిస్తే ఈ బ్రేక్ మీకు కచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు కేరీర్​లో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. విరామం తీసుకోవడం మీకు అనుకూలమైనదో కాదో కూడా తెలుస్తుంది. ఓ సంబంధం నుంచి విడిపోయిన తర్వాత మీరు వారు లేకున్నా బతికి ఉండగలరో లేదో.. లైఫ్​ని లీడ్​ చేయగలరో లేదో తెలుస్తుంది. కొందరు దాంపత్యం నుంచి విడిపోతే ఎలా బతుకుతామోనని భయపడతారు. కాబట్టి ఈ బ్రేక్​వల్ల ఈ విషయంపై మీకు క్లారిటీ వస్తుంది. 


విడిపోవడం వల్ల మీరు అవతలి వ్యక్తిని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది. విడిపోయిన తర్వాత అయ్యో అని బాధపడడం కన్నా.. వారి నుంచి బ్రేక్​ తీసుకుని మీరు ప్రేమించే వ్యక్తికి దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలిసి ఉన్నప్పుడు మీ వాల్యూ ఏంటో అవతలి వాళ్లు గుర్తించలేకపోతున్నారా? అయితే దూరంగా ఉన్నప్పుడు వారు మీ వాల్యూ తెలుసుకుంటారు. కాబట్టి ఈ బ్రేక్ మీ రిలేషన్​కి ఓ మంచి గ్రీన్ ఫ్లాగ్ అవుతుంది. 


మీరు బ్రేక్​ తీసుకున్న సమయంలో మీ భాగస్వామిని మోసం చేయకుండా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇది మీ రిలేషన్ కొనసాగించాలనుకున్నప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. మీకు బ్రేక్ తీసుకోవాలనిపిస్తే.. మీ భాగస్వామికి మానసిక స్థితిని వివరించి.. బ్రేక్ అంటే అసలైన అర్థం తెలిపి బయటకు రండి. మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే అది మీరు చేసే పెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు. మీ రిలేషన్​ నుంచి ఎప్పటివరకు బ్రేక్​ కావాలనుకుంటున్నారో చర్చించండి. 


అయితే బ్రేక్​ తీసుకున్నాం కదా అని బాధ్యతలన్నీ ఒకరిపై వేయడం కరెక్ట్ కాదు. ఆర్థిక విషయాల్లో ఇద్దరూ హుందాగా వ్యవహరించాలి. అంతేకాకుండా సింగిల్​గా లైఫ్ లీడ్​ చేయగలరో లేదో తెలుసుకోవచ్చు. బ్రేక్​ తర్వాత అవతలి వ్యక్తి స్వచ్ఛందంగా వస్తే మంచిదే. కానీ రమ్మని బలవంతం మాత్రం చేయొద్దు. కొందరు విడిపోవాల్సిన టైమ్​లో విరామం తీసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు బ్రేక్​ కన్నా బ్రేకప్​ చేసుకోవడమే మిన్న.  తిరిగి రావాలని మాత్రం బలవంతం చేయవద్దు.


Also Read : తల్లికి బ్రెస్ట్​ క్యాన్సర్ ఉంటే.. పిల్లలకు తల్లిపాలు ఇవ్వొచ్చా? లేదా?