Horoscope Today October 21st, 2023



మేష రాశి
ఈ రాశివారికి ఖర్చులు అధికమవుతాయి. ఏదో అసౌకర్యంగా ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అధిక కోపాన్ని నివారించాలి. స్నేహితుడిని కలుస్తారు. పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


వృషభ రాశి
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు శుభవార్త అందుతుంది. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. వ్యాపారం మెరుగుపడుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 


మిథున రాశి 
ఈ రాశి ఉద్యోగులకు పనిచేసే ప్రదేశంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. మనసులో శాంతి, సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో పరిస్థితి మెరుగుపడుతుంది. అన్నదమ్ముల సాంగత్యాన్ని పొందవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సంభాషణలో సంయమనం పాటించండి.


కర్కాటక రాశి
కుటుంబంతో కలిసి కొన్ని మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రను ప్లాన్ చేయవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ రాశి విద్యార్థులకు  చదువులపై ఆసక్తి ఉంటుంది. విద్యా విషయాలలో మెరుగుదల ఉంటుంది. కార్యరంగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


సింహ రాశి 
ఈ రాశివారికి సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు. సహనంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ ఇష్టానికి విరుద్ధంగా కార్యాలయంలో మార్పులు ఉండొచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ప్రేమికులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.


కన్యా రాశి 
ఈ రాశివారికి వ్యాపారంలో స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ వాక్కు ప్రభావం పెరుగుతుంది.  మీరు మీ తల్లి నుంచి ఆర్థిక సహాయం  పొందుతారు. ఉన్నత స్థితిలో ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది.


తులా రాశి
మనసులో శాంతి, సంతోషం నిండి ఉంటుంది కానీ మాటలో కర్కశత్వం ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. తల్లిదండ్రుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పూర్తి విశ్వాసంతో ఉంటారు. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా శాంతిస్తారు. విద్యా పనులలో ఆటంకాలు ఉండవచ్చు.


వృశ్చిక రాశి
మీకు ప్రభుత్వం , అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. తల్లి సహకారంతో ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉపాధికి బాటలు వేసుకోవచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎక్కువ శ్రమ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు.


ధనుస్సు రాశి
ఆదాయం తగ్గడం, అధిక ఖర్చులు వచ్చే పరిస్థితి వల్ల ఇబ్బంది పడతారు. ఆశ, నిస్పృహ అనే భావాలు మనసులో మెదులుతాయి. స్నేహితుని సహాయం ఆదాయ వనరుగా మారుతుంది. వాహన నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు. పిల్లల సంతోషం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నాలు చేయండి 


మకర రాశి
ఉద్యోగంలో అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓపికపట్టండి. మాటలో సౌమ్యత ఉంటుంది. పని ప్రదేశంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. అధిక కోపం  నివారించండి. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు.


కుంభ రాశి
చాలా శ్రమ ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా శాంతిస్తారు. దాంపత్య సంతోషం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. భవన నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది.


మీన రాశి
మీరు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఇదే మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. మనసులో ఏవో ప్రతికూల ఆలోచనలు ఉండొచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మోధోపరమైన పని ఆదాయవనరుగా మారే అవకాశం ఉంది.