Navratri Day 7 Lalitha Devi: సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా  చిరుమందహాసంతో దర్శనమిస్తుంది లలితా దేవి. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందంటారు


ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్


ఆదిశక్తి రూపాలైన  త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత, పంచదశాక్షరీమంత్రాధిదేవత, భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమిరోజు శ్రీ లలితాదేవి ఆవిర్భ వించినట్టు పురాణాలు చెబుతున్నాయి.


లలితా దేవి ఆవిర్భావం
భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపో నిష్టకు మెచ్చి ప్రత్యక్ష మైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడ. ఎవరైనాతనతోయుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థిబలంలో సగం తనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. ఆ వరాన్ని అనుగ్రహించకతప్పలేదు. ఆ వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తనసోదరు లతో కలిసిమూడులోకాలనూపీడిం చడం మొదలుపెట్టాడు. ఆ బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతనుఆరాధించారు. మహాయాగం చేశారు. ఆ హోమగుండం నుంచి ఉద్భవించంది శ్రీ లలితాదేవి. శ్రీచక్రాన్నిఅధిష్ఠించి,భండాసు రుణ్ణి సంహరించింది. లలితాదేవి రౌద్రరూపాన్నిశాంతింపజేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ చెప్పిన నామాలే ‘శ్రీ లలితా సహ స్రనామం’ గా ప్రాచుర్యం పొందాయి. 


పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి, లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళ ల్లోప్రావీణ్యాన్నీ, కుటుంబ సంతోషాన్ని, సంపదనూప్రసాదిస్తుందనీ భక్తుల విశ్వాసం. 


శ్రీ లలితా పంచరత్న స్తోత్రం
ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ || 1 ||


ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్
మాణిక్యహేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు సృణీర్దధానామ్ || 2 ||


ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ || 3 ||


ప్రాతః స్తువే పరశివాంలలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాఙ్మనసాతిదూరామ్ || 4 ||


ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి 
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || 5 ||


యః శ్లోక పంచక మిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతిప్రభాతే
తస్మై దదాతి లలితా ఝడితిప్రసన్నా విద్యాంశ్రియం విమలసౌఖ్య మనన్తకీర్తిమ్ ||


ఇతి శ్రీమత్ శంకరభగవతః కృతౌ లలితా పంచకం సంపూర్ణమ్