Todays Top 10 News: 


1. రేవంత్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన అందుకేనా...?


తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించనున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చించేందుకే రేవంత్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


2.కొండా సురేఖపై ట్రోలింగ్.. స్పందించిన హరీశ్ రావు


మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని అన్నారు. 'BRS అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్ మాడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్ని కోరుతున్నా' అని హరీష్ రావు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


3. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్


హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. శని, ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని నిలదీసింది. చార్మినార్‌ను కూల్చేయాలని అక్కడి ఎమ్మార్వో చెప్తే కూల్చేస్తారా అని హైకోర్టు ఫైర్ అయ్యింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


4. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపారనే పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీ జరిగిందో లేదో తేల్చేందుకు ల్యాబ్ కు పంపారా అని ప్రశ్నించింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ సేకరించారా అని నిలదీసింది. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


5. ఇంటికి వెళ్లనివ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి


తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత 15 రోజులు తన నియోజకవర్గంలోకి వెళ్లకూడదని పోలీసులు చెప్పారని.. ఆ గడువు కూడా ముగిసిపోయిందన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సాకుతో పోలీసులు అనవసరంగా వదంతులు క్రియేట్ చేసి నియోజకవర్గంలోకి వెళ్లకుండా చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


6. సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనన్న షర్మిల
తిరుమల లడ్డూ కల్తీపై సోమవారం సుప్రీంకోర్టు చేసిన సూచనపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు చేసిన సూచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది. కేంద్రం దర్యాప్తు చేయాలని, CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వాదిస్తోంది. దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే సుప్రీం సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


7. ఏపీలో కాక్సాకీ వైరస్ కలకలం
ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో కాక్సాకీ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా కనపడుతున్నాయి. విశాఖలోనూ కాక్సాకీ వైరస్ బారినపడిన చిన్నారులు ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. కాక్సాకీ వైరస్ తో హ్యాండ్‌ ఫుట్ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ వస్తుంది. ఇది ముఖ్యంగా చిన్నారుల్లో కనపడుతుంది. రోజుల వయసున్న పిల్లలతో పాటు 10 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా కాక్సాకీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


8. ఈ నెలలో సెలవులే సెలవులు


తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు అక్టోబరులో భారీగా సెలవులు రానున్నాయి. దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్‌లో 16 రోజులపాటు పాఠశాలలు మూతపడనున్నాయి. అక్టోబరు 2 నుంచి 14 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబరు 31న దీపావళి సెలవు. 14 రోజులు పండుగ సెలవులతోపాటు.. అక్టోబరు 20, 27 ఆదివారాలు కలిపి అక్టోబరులో మొత్తం 16 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో 15 రోజులే స్కూళ్లు నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


9. ఒక్కరోజే కూలిన 18 వికెట్లు


కాన్పూర్ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. మైదానం తడిగా ఉండటం వల్ల రెండు, మూడు రోజుల్లో ఆట జరగకపోగా, ఎట్టకేలకు నాలుగో రోజు కొనసాగగా.. ఒకేరోజు 18 వికెట్లు నేలకొరిగాయి. నాలుగో రోజు 107/3తో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్ దీప్‌ రెండేసి జడేజా ఒక వికెట్ పడగొట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


10. కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సిరాజ్


బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత క్యాచ్ తో మెరిశాడు. వెనక్కి పడుతూ ఒంటి చేత్తో సిరాజ్ ఈ క్యాచ్ ను నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. సిరాజ్ సూపర్ క్యాచ్ తో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ నిరాశగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. మిడ్-ఆఫ్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ అందుకున్న అద్భుత క్యాచ్‌ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..