Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా

IND vs BAN: కాన్పూర్ లో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఎంతో క‌ష్ట‌మైన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒంటి చేత్తో అందుకున్న కాసేపటికే సిరాజ్ ఓ స్ట‌న్నింగ్ క్యాచ్‌ పట్టాడు.

Continues below advertisement
Mohammad Siraj took a stunning one-handed catch: బంగ్లాదేశ్ ( Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా(India) పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) అద్భుత క్యాచ్ తో మెరిశాడు. మాములుగా పదునైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే సిరాజ్. ఒంటి చేత్తో అందుకున్న క్యాచ్ తో అబ్బురపరిచాడు. వెనక్కి పడుతూ ఒంటి చేత్తో సిరాజ్ ఈ క్యాచ్ ను నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. సిరాజ్ సూపర్  క్యాచ్ తో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ నిరాశగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. మిడ్-ఆఫ్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. గాల్లోకి వెనక్కి పడుతూ ఈ క్యాచ్ ను అందుకున్నాడు.
లిట్టన్ దాస్‌ క్యాచును అద్భుతంగా రోహిత్ శర్మ అందుకున్న కాసేపటికే సిరాజ్ కూడా మరో సూపర్ క్యాచ్ తో మెరిశాడు. 

అశ్విన్ వేసిన పదో ఓవర్లో ఈ అద్భుతం జరిగింది. షకీబ్ అల్ హసన్ ను తన ఉచ్చులోకి లాగిన అశ్విన్ లాఫ్టెట్ షాట్ ఆడేలా ఉసికొల్పాడు. దీనికి బలైన షకీబ్ షాట్ ఆడాడు. అలా సిరాజ్ పట్టిన అద్భుత క్యాచుకు వెనుదిరిగాడు. 

దీంతో గత కొంత కాలంగా  టీమ్ఇండియా ఫీల్డింగ్ ఎంతో మెరుగుప‌డింది అన్న విషయం మరోసారి స్పష్టం అయ్యింది . అసలు  ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆటగాళ్ళు  అద్భుత ఫీల్డింగ్ చేస్తున్నారు. వికెట్లు పడగొట్టడంలోనూ  బౌలర్స్ కు తమ వంతు సాయం అందిస్తున్నారు. 

Continues below advertisement