Morning Top News:


ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్‌ . ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ నుంచే అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తితో దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



వాహనదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష మిగులుతుందని తెలిపారు. తెలంగాణలో నేటి నుంచే కొత్త ఈవీ పాలసీ అమల్లోకి వస్తుందని చెప్పారు. రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సోదరుడి పాడె మోసిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుడి పాడెను సీఎం చంద్రబాబు మోశారు. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్‌, రామ్మూర్తి నాయుడి తనయుడు, సినీ నటుడు నారా రోహిత్‌, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ఏపీ పాఠశాలల టైమింగ్స్ మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. అకడమిక్‌ కేలండర్‌లో ఆప్షనల్‌గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీన్ని 5 గంటల వరకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి రెండు స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

దెయ్యం భయంతో వణుకుతున్న గ్రామం

ములుగు జిల్లా జంగాలపల్లిలో గ్రామస్థులు.. దెయ్యం భయంతో వణికిపోతున్నారు. గ్రామానికి ఏదో కీడు సోకిందని అందుకే నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. 2 నెలల్లోనే 20 మంది మృతి చెందడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. తమ గ్రామాన్ని ఏదో దెయ్యం పట్టుకుందని భయాందోళనకు గురవుతున్నారు.  ఇక్కడే ఉంటే తమకు కూడా మరణం తప్పదనే భయంతో కొందరు ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్తున్న వారిలో విద్యావంతులు కూడా ఉన్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదా..?

లగచర్లలో అధికారులపై దాడి ఘటన కలకలం రేపుతున్న వేళ కాంగ్రెస్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. లగచర్ల, హకింపేట్, పోలేపల్లి గ్రామాల్లో వచ్చేది ఫార్మా కంపెనీ కాదని ప్రచారం చేస్తోంది. స్థానికంగా ఉండే వ్యక్తి నర్సింహా రెడ్డి ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... లగచర్లలో వచ్చేది ఫార్మా కంపెనీ కాదని స్పష్టం చేశారు. సీఎంతో సమావేశం అయినప్పుడు ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నట్టు చెప్పారు. ఇదే విషయంపై సీఎంను ప్రశ్నిస్తే ప్రజలకు ఇష్టం లేకపోతే ఇండస్ట్రీయల్ పార్క్‌ తీసుకొద్దామని అన్నట్టు వివరించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియాలో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని ఫిర్యాదుతో సీఐ రమణయ్య, కొడాలి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

మొబైల్ గేమ్ ఆడుతూ.. సాంబార్‌లో పడి..

మొబైల్‌లో గేమ్ ఆడుతూ కర్నూలు జిల్లాకు చెందిన బాలుడు ప్రమాదవశాత్తు సాంబారులో పడి మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల  మండలం వేమూగోడుకు చెందిన జగదీష్ అమ్మానాన్నలతో కలిసి మేనమామ పెళ్లి కోసం గద్వాల జిల్లా  వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి వెళ్లాడు. అయితే, పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలను ఓ గదిలో ఉంచారు. మొబైల్‌లో గేమ్ ఆడుతున్న జగదీష్.. చూసుకోకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు.  గిన్నె మూత పక్కకు జరగడంతో వేడిగా ఉన్న సాంబారులో జగదీష్ పడి మరణించాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


పసికందు గుండె చీల్చిన కన్నతల్లి


 తాంత్రిక విద్యల భ్రమలో పడి ఓ తల్లి కన్న కూతురినే కిరాతకంగా చంపేసింది. ఏడాదిన్నర చిన్నారి గుండెను చీల్చి శరీరంపై కత్తిగాట్లు పెట్టి చంపేసింది. ప్రశ్నించిన వారికి మీరు కాస్త ఆగిఉంటే నా పిల్లాడిని నేనే బతికించేదానిని అని చెబుతోంది. ఈ ఘోరం జార్ఖండ్‌లో జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



రచ్చ రేపుతున్న పుష్ప-2 ట్రైలర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' నుంచి ట్రైలర్ విడుదలైంది. బీహార్‌లోని పాట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న గాంధీ మైదాన్‌లో 'పుష్ప 2' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లో ఊరమాస్ లుక్‌లో బన్నీ'శ్రీవల్లి నా పెళ్లం. పెళ్లం మాట మొగుడు ఇంటే ఎట్ట ఉంటదో ప్రపంచకానికి చూపిస్తా' అంటూ చెప్పిన డైలాగ్ ఉర్రూతలూగిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..