Nabeel Used Eviction Shield to Avinash: బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండే కాస్తా ఫ్యామిలీ ఎపిసోడ్‌‌లా మారిపోయింది. కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్లు, బుల్లితెర సెలెబ్రిటీలు వచ్చారు. కంటెస్టెంట్లలో వారిలో వారికే ఓ క్లారిటీ వచ్చినట్టుంది. ఎవరు టాప్ 5లో ఉంటారో అన్న దానిపై క్లారిటీ తెచ్చుకుని ఉంటారు. ఇక ఈ సండే ఎపిసోడ్‌లో యష్మీ, తేజ, అవినాష్, నిఖిల్ కోసం ఫ్యామిలీ మెంబర్లు, సెలెబ్రిటీలు వచ్చారు. ఇక చివర్లో నామినేషన్ విషయంలో నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ప్రత్యేక పాత్రను పోషించింది. అసలు ఈ సండే ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.


యష్మీ కోసం సత్య, సంయుక్త వచ్చారు. యష్మీ సాయంత్రం ఆరు అయితే ఇంకోలా ఉంటుందని, అవన్నీ మీరు అందిస్తే తనలోని ఇంకో కోణం బయటకు వస్తుందని చెప్పారు. యష్మీ, సత్య, సంయుక్తలకు ఓ సైన్ ఉందట. మామా ఏక్ పెగ్ లా అంటూ తన మందు అలవాట్ల గురించి యష్మీ సైతం హింట్ ఇచ్చింది. బయటకు వచ్చిన తరువాత పార్టీ చేసుకుందాం అంటూ యష్మీ మందు పార్టీ గురించి హింట్ ఇచ్చింది.


సత్యను అవినాష్ మందలించాడు. దీంతో అవినాష్ బాగోతం కూడా సత్య బయట పెట్టేసింది. అబ్రాడ్‌కి ఈవెంట్ కోసం వెళ్తే సాయంత్రం ఆరు తరువాత నువ్వేం చేస్తావో చెప్పాలా? అంటూ అవినాష్‌ని సత్య ఆడుకుంది. సత్య కూడా ఆరు తరువాత వేరేలా ఉంటుంది అని మందు తాగుందని హింట్ ఇచ్చాడు. కానీ సత్య మాత్రం నేను తాగను అన్నట్టుగా సైగ చేసింది.


ఆ తరువాత తేజ కోసం సన్నీ, తేజ తండ్రి వచ్చారు. నువ్వు నీ కలను నెరవేర్చుకున్నవ్.. బిగ్ బాస్ కప్పు కొట్టాలనే మీ అమ్మ కల కూడా నెరవేర్చు అని తేజకు ఆయన తండ్రి చెప్పాడు. ఇక సన్నీ మాట్లాడుతూ.. తేజను పొగిడేశాడు. చాలా బాగా ఆడుతున్నాడు.. శక్తిని మించి పోరాడుతున్నాడు అని చెప్పాడు. ఇక ఇంట్లో అందరి గురించి చెబుతూ విష్ణు ప్రియ వరకు వచ్చి పరువు తీశాడు.


ఇంట్లో ఏ వచ్చి బీ పై వాలే.. బీ వచ్చి సీ పై వాలే అని అంటున్నారు. కానీ వీ వచ్చి పీ పై వాలుతూనే ఉంది.. కానీ పీ వాలనివ్వడం లేదు.. ఆరెంజ్ సినిమా ఉంది కదా.. విష్ణుని పెట్టి బత్తాయి అని సినిమా తీయాలంటూ పరువు తీసేశాడు. అసలు విష్ణు తనకు వస్తున్న సూచనలు, సలహాల్ని వినిపించుకోవడం లేదు. తండ్రి చెప్పినా, యాంకర్ రవి వివరించి చెప్పినా, సన్నీ ఇలా కౌంటర్లు వేసి చెప్పినా విష్ణు మాత్రం తన పంథాను మార్చుకోవడం లేదు. పృథ్వీ వెనకాలే తిరుగుతోంది.


అవినాష్ కోసం కోన వెంకట్, అవినాష్ ఫ్రెండ్ వచ్చాడు. కంటెస్టెంట్ల గురించి కోన వెంకట్ మాట్లాడాడు. అవినాష్‌కు అదుర్స్, విష్ణుకి నిన్ను కోరి, నబిల్‌కు దూకుడు, పృథ్వీకి బలుపు అంటూ ఇలా తన సినిమా టైటిల్స్‌ను కంటెస్టెంట్లకు కోన వెంకట్ డెడికేట్ చేశాడు. ఇక నిఖిల్ కోసం అమర్, నిఖిల్ ఫాదర్ వచ్చాడు. నిఖిల్ మంచి మనసు, గొప్పదనాన్ని చెప్పాడు. తనకు కాళ్లు చచ్చిపడిపోతే.. నన్ను బాత్రూంకి ఎత్తుకుని తీసుకెళ్లాడు.. నిఖిల్ అంత మంచి వాడు అని అమర్ చెప్పుకొచ్చాడు. కాస్త ఫోకస్ పెట్టి ఆడు.. నామినేషన్స్‌లో నీ సొంత కారణాలు చెప్పు అంటూ ఇలా సలహాలు ఇచ్చాడు. నువ్వు ఆట మీద కాస్త ఫోకస్ పెట్టు అని విష్ణుకి సలహాలు ఇచ్చాడు. తేజ, అవినాష్, రోహిణి, గౌతమ్ అద్భుతంగా ఆడుతున్నారు అని అన్నాడు.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 76 రివ్యూ: తేజని హీరో చేసిన బిగ్ బాస్.. ఫ్యామిలీ ఎపిసోడ్‌ సంపూర్ణం.. అవినాష్‌కు కలిసొచ్చిన లక్



కంటెస్టెంట్ల ఫ్యామిలీ రావడం ముగియడంతో ఓ ఆట ఆడించాడు నాగ్. ఆ ఆట అనంతరం.. తేజ, అవినాష్‌లు ఎలిమినేషన్ చివరి దశ వరకు వచ్చాడు. ఆ టైంలో నబిల్ ఎవిక్షన్ షీల్డ్ గురించి నాగ్ అడిగాడు. ఆ షీల్డుని ఇప్పుడు వాడతావా? అని అడగడంతో.. వాడతాను అని నబిల్ చెబుతాడు. అవినాష్ వల్లే ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది.. అతని కోసం వాడుదామని అనుకుంటున్నా అని చెప్పాడు నబిల్. అలా ఎలిమినేట్ అయిన అవినాష్‌కు నబిల్ ఎవిక్షన్ షీల్డ్ పనికి వచ్చింది.    చివరకు ఈ వారం నో ఎలిమినేషన్ అన్నట్టుగా మారింది. లేదంటే ఈ వారం అవినాష్ బయటకు వెళ్లాల్సి వచ్చేది. మరి నెక్ట్స్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండేట్టుగా కనిపిస్తోంది.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 75 రివ్యూ: విష్ణు ప్రియ కూతురు లాంటిది - బాంబు పేల్చిన పృథ్వీ తల్లి... ప్రేరణ, అవినాష్ మధ్య గొడవ - గౌతమ్‌కి వార్నింగ్