Bigg Boss Nikhil Love Story with Kavya Shree : బిగ్​బాస్​లోకి వెళ్లడం.. అక్కడ మరొకరితో లవ్ ట్రాక్ నడపడం.. చివర్లో ఇదంతా డ్రామా.. బయట నాకు వేరే ఉన్నారనడం.. చివరకి బ్రేకప్​ అయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్​లు రావడం. ఇదంతా ఎక్కడో చూసినట్టుంది కదూ. అప్పట్లో షణ్ముక్ స్టోరినే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరీ బిగ్​బాస్ తెలుగు సీజన్ 8లో రిపీట్ అవుతున్నట్టే కనిపిస్తోంది. నిఖిల్ తన లవ్​ స్టోరి షేర్ చేసుకున్న వెంటనే.. కావ్య శ్రీ తన ఇన్​స్టాలో పెట్టిన స్టోరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమి జరుగుతోంది. 


బిగ్​బాస్​కి వెళ్లకముందు నిఖిల్.. కావ్య శ్రీ కలిసి రిలేషన్​షిప్​లో ఉన్నారు. ఇద్దరూ కలిసి షోలకు వెళ్లడం, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం, ఇన్​స్టాలో కలిసి ఫోటోలు పెట్టడం ఇలా ఎన్నో జరిగాయి. కానీ బిగ్​బాస్​ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చేప్పుడు నిఖిల్ నేను సింగిల్​ అంటూ నాగ్​తో చెప్పాడు. దీంతో నిఖిల్, కావ్య మ్యూచువల్ ఫ్యాన్ తెగ ఫీల్ అయిపోయారు. పైగా హోజ్​లోకి వెళ్లిన తర్వాత సోనియాతో చాలా క్లోజ్​గా ఉన్నాడు నిఖిల్. 


యశ్మీతో లవ్ ట్రాక్


సోనియా హోజ్​నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత యశ్మీ, నిఖిల్ లవ్ ట్రాక్ పట్టాలెక్కింది. వారిద్దరూ ఇష్టంగా ఉంటూన్నట్టే.. నిజంగానే లవ్ ఉన్నట్లే బిహేవ్ చేశారు. సీజన్ అయిపోతుంది అనుకునే సమయానికి.. బయట నాకు ఇంకొకరు ఉన్నారంటూ కొత్త క్యారెక్టర్​ని తెరపైకి తీసుకువచ్చాడు నిఖిల్. తాజాగా ఫస్ట్ లవ్​ గురించి చెప్పమంటే.. కావ్య శ్రీని ఉద్దేశిస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. బయటకు వచ్చాక నిన్నే మొదట మీట్ అవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను అంటూ ఏడుస్తూ చెప్పాడు. 


సింపతీ కార్డ్?


అయితే నిఖిల్​ హోజ్​లోకి వెళ్లినప్పటి నుంచి కావ్య శ్రీ.. నిఖిల్​ గురించి ఒక్కపోస్ట్​ కూడా పెట్టలేదు. అయితే తాజాగా నిఖిల్ లవ్ స్టోరి చెప్పిన తర్వాత కావ్య శ్రీ తన ఇన్​స్టాలో ఓ స్టోరి పెట్టింది. Dont be fooled by their masks. fake people eventually show their true colors. just wait until their mask needs cleaning అంటూ కొటేషన్​ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిఖిల్ సీజన్​ చివరికి వచ్చేసరికి సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడంటూ కొందరు పోస్ట్​లు పెడుతుంటే.. మరికొందరు వీరిద్దరూ మళ్లీ కలవాలంటూ పోస్ట్​లు పెడుతున్నారు. 


అవే రీజన్సా?


నిఖిల్, కావ్య శ్రీ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం.. వారిద్దరూ కచ్చితంగా కలుస్తారంటున్నారు. తాను కూడా తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పైగా ఆమెనే తన వైఫ్​ అని కూడా ఫిక్స్ అయ్యానని చెప్పాడంటూ పోస్ట్​లు వేస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీ రీజన్స్​తోనే విడిపోయి ఉంటారని నిఖిల్​ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు కావ్య శ్రీ మళ్లీ అతనిని యాక్సెప్ట్ చేయదు. ఇంత చేసినా తర్వాత కూడా ఆమె నిఖిల్​ని కలవదంటూ తెగ ప్రిడిక్ట్ చేసేస్తున్నారు. మరి నిఖిల్​ హోజ్​నుంచి బయటకు వచ్చాక ఏమి జరుగుతుందో? వేచి చూడాల్సిందే. 



Also Read : బిగ్​బాస్​ హోజ్​లోకి మళ్లీ వెళ్తోన్న శోభా శెట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోందట