Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..


కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య


కర్ణాటక ఎపిసోడ్‌కు కాంగ్రెస్ శుభం కార్డు వేసింది. ఐదు రోజులుగా సాగుతున్న పంచాయితీకి తీర్పు ఇచ్చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే అది ఢిల్లీలో చేస్తారా లేకుంటే కర్ణాటక వెళ్లి చేస్తారా అన్నది ఇప్పటి ఇంకా స్పష్టత లేదు. 


ఏఎన్‌ఐ చెప్పిన వివరాలు పరిశీలిస్తే... సిద్దరామయ్య రెండేళ్ల పాటు సీఎంగా కొనసాగనున్నారు. అనంతరం మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ ఉండబోతున్నారని టాక్. డిప్యూటీ సీఎం పదవితోపాటు తన అనుచరులకు ఆరు మంత్రి పదువులు ఇవ్వాలని శివకుమార్‌ డిమాండ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ అధిష్ఠానం ఓకే చెప్పినట్టు సమాచారం. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


కొత్త సచివాలయంలో తొలి భేటీ


తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ బేటీ కానుంది. కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి రాత్రి మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మే 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొదలుకానున్న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నందన సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదలపై కీలకంగా చర్చ జరగనుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున బీసీ బంధు, దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పించన్ల పంపిణీ అమలు తీరుపై చర్చించనున్నారు. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


స్థలాలు పంచేశాక కోర్టులో అనుకూల తీర్పు రాకపోతే ?


 అమరావతి రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. గత  ప్రభుత్వం హైదరాబాద్ లాగా అబివృద్ది చేసి .. మరో మెట్రో సిటీని సిద్ధం చేసుకుంటామని కలలు కన్నది. కానీ మారిన ప్రభుత్వం  మాత్రం అసలు ఆ గ్రాఫిక్స్ ఎలా సాధ్యమని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూముల్ని పేదలకు పంచేందుకు సిద్ధమయింది. నిజానికి ఆ భూముల్ని రైతులు పూర్తిగా ప్రభుత్వానికి పరిహారం తీసుకుని ఇవ్వలేదు. డెలవప్‌మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. రైతులకు చట్టం ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించకుండానే హామీ ఇచ్చినట్లుగా అభివృద్ధి చేయకుండానే వారి భూముల్ని సెంటు స్థలాలకు ఇస్తున్నారు. ఇప్పుడు విషయం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ పట్టాలు పంచడానికి రెడీ అయ్యారు. దీంతో వివాదం ప్రారంభయింది. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


ఠారెత్తుతున్న ఎండ


రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో బుధవారం (మే 17) తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


బలపడిన విపక్షాలు - సెంటిమెంట్ ఆయుధం దూరం!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 సీట్లలో గెలుపు ఖాయమని ప్రకటించారు. వందేళ్లలో చేయేలని అభివృద్ధి చేశామని.. చేసింది చెప్పుకుంటే చాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అత్యవసరంగా పిలిచిన నిర్వహించిన  మీటింగ్‌లో చెప్పింది ఇదే. కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటన్నది పార్టీ నేతలకూ అర్థం కాని విషయం.  నిజానికి తెలంగాణలో ప్రస్తుతం అంత ఏకపక్ష వాతావరణం లేదని కానీ.. పార్టీ నేతల్లో నమ్మకం, ఆత్మ విశ్వాసం కల్పించడం.. నేతలు ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండటానికి ఇలా చెప్పారని ఎక్కువ మంది భావిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


నాది అద్దె ఇల్లు, నీకు ఊరూరా ప్యాలెస్‌లు: సీఎం జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్


ప్రశాంతమైన విశాఖ నగరంలో అరాచకాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. హుద్ హుద్ సమయంలో ఇక్కడే ఉండి ప్రజలకు సాయం చేశామని.. హుద్ హుద్ ముందు విశాఖ, తర్వాత విశాఖ అని చర్చించుకునేలా నగరాన్ని తీర్చిదిద్దామని బాబు చెప్పుకొచ్చారు. అలాంటి విశాఖకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా, ఒక్క కంపెనీ అయినా వచ్చిందా, ఒక్క ఉద్యోగం కల్పించారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా అయితే జనం ఎలా బతుకుతారని.. అందుకే ఇదేం ఖర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లుగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న బాబు.. పెందుర్తిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన టీడీపీ అధినేత వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి 


టెస్లా గుడ్ న్యూస్


టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల నిర్వహించిన ఆటోమేకర్స్ 2023 వార్షిక సమావేశంలో భవిష్యత్తులో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాల గురించి సమాచారం ఇచ్చారు. టెస్లా కొత్త డిజైన్ కారుపై పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ రెండు వాహనాలు సాంకేతికత పరంగా ప్రస్తుతం ఉన్న వాహనాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎలాన్ మస్క్ ఈ వాహనాల గురించి సమాచారం ఇస్తున్న సమయంలోనే అతని వెనుక స్క్రీన్‌పై ఒక వాహనం  టీజర్ ప్రొజెక్ట్ చేశారు. ఇది హ్యాచ్‌బ్యాక్ అని భావిస్తున్నారు. దీని గురించి ఎలాన్ మస్క్ కొంతకాలం క్రితమే ప్రకటించారు. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


ఒళ్లు పెరిగితే ఆరోగ్యం గుల్ల


శరీరంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఎక్కువ బరువు కలిగి ఉండడాన్ని స్థూలకాయంగా చెప్పవచ్చు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 25 లేదా అంతకంటే ఎక్కువ గా ఉన్నపుడు వారిని స్థూలకాయులుగా పరిగణిస్తారు. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. శరీరం వినియోగించే క్యాలరీల ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోయి స్థూలకాయంగా మారుతుంది. కొంత మందిలో జన్యుకారణాలు కూడా ఉండొచ్చు. మరి కొందరిలో పెద్దగా కదలికలు లేని జీవన శైలి కూడా కారణం కావచ్చు. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


ఈ రాశుల వారికి ఆర్థిక పురోభివృద్ధి!


అనుకోని ప్రమాదాలు వల్ల కొంత నష్టం కలుగుతుంది . ఏ పనిలోనూ తొందరపడకండి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి . తలపెట్టిన పనులు సక్రమంగా పూర్తికావు.  కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు. ఖర్చులు తక్కువ ,ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకు  సహోద్యోగులు నుంచి  నిరసనలు  వ్యక్తం అవుతాయి. ఆపదలు  పొంచి ఉన్నాయి అప్రమత్తం గా ఉండండి .  కాస్త ఓరిమితో వ్యవహరించండి. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి


పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ


ఐపీఎల్‌ 2023 సీజన్‌లో మరో డ్రమెటిక్ ఫినిష్. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ జరిగింది. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 33 పరుగులు కావాలి. క్రీజులో సెటిలైన లియాం లివింగ్ స్టోన్ (94: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) ఉన్నాడు. మొదటి బంతికే ఇషాంత్ డాట్‌గా విసిరాడు. దీంతో ఢిల్లీ విజయం దాదాపు లాంఛనం అయింది. లియాం లివింగ్‌స్టోన్ రెండో బంతిని సిక్సర్‌గానూ, మూడో బంతిని ఫోర్‌గానూ తరలించాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో బంతి లియామ్ లివింగ్‌స్టోన్ నడుం పైనుంచి వెళ్లడం, దాన్ని అతను సిక్సర్ కొట్టడం జరిగిపోయాయి. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 16 పరుగులుగా మారింది. కానీ లివింగ్‌స్టోన్ తర్వాతి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోతాడు. దీంతో ఢిల్లీ 15 పరుగులతో విజయం సాధించింది. పూర్తి సమాచారాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి