Morning Top News:


జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల


చంచల్ గూడ జైలు నుంచి సినీ నటుడు అల్లు అర్జున్ విడుదల అయ్యారు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో.. మెయిన్ గేటు నుంచి రిలీజ్ చేశారు. శుక్రవారం రాత్రి కోర్టు తీర్పు కాపీని అల్లు అర్జున్ తరపు లాయర్లు రాత్రి 10 గంటలకు జైలు అధికారులకు ఇచ్చారు. ఐతే.. ఆ కాపీలో తప్పులు ఉన్నాయని చెప్పిన జైలు అధికారులు.. కొన్ని మార్పులు సూచించారు. శనివారం ఫార్మాలిటీస్ పూర్తి చేయించి, బయటకు పంపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


జైల్లో నేలపైనే నిద్రపోయిన పుష్పరాజ్


సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, జైలు అధికారులకు బెయిల్ పత్రాలు రాత్రి 10:30 గంటలకు అందడంతో ఆయన్ను రాత్రంతా జైల్లోనే ఉంచారు. ఖైదీలందరూ బ్యారక్‌కు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్‌ క్లాస్ - 1 రూంలో ఉంచారు. జైలు అధికారులు ఫుడ్ ఇచ్చినా బన్నీ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీదే పడుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


చట్టం తన పని తాను చేసుకుపోయింది: రేవంత్


అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ లో నా జోక్యం ఏమీ ఉండదు, చట్టం ముందు అందరూ సమానులే.. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ముందు రేవంత్ ను అరెస్ట్ చేయాలి: కేటీఆర్


జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్  అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు."అభద్రతా భావంతో ఉన్న నాయకుడు ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న వారిని నాశనం చేస్తుంటాడు" అంటూ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. తొక్కిసలాట ఘటనలో బాధితుల పట్ల తనుకు పూర్తి  సానుభూతి ఉంది కానీ ఈ ఘటనలో నిజంగా ఎవరు విఫలమయ్యారు? అని క్వశ్చన్ చేశారు.  అంతేగాక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం పట్ల 'పుష్ప 2' హీరోయిన్ రష్మికతో పాటు పలువురు సెలబ్రిటీలు స్పందించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


అల్లు అర్జున్ అరెస్టుతో రేవంత్ రిస్క్ చేశారా..?


"రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది" అని అల్లు అర్జున్ కేసులో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే బన్నీ అరెస్ట్ తో రేవంత్ రాజకీయంగా రిస్క్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ చట్టం అమలు విషయంలో ప్రజలకు ఓ భరోసా ఇవ్వాలనుకున్నారని అంటున్నారని తెలుస్తోంది. రేవంత్ తీరు పార్టీకి నష్టం చేస్తున్నా.. ప్రజలకు మాత్రం వ్యవస్థలపై విశ్వాసం పెంచుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఫార్ములా రేసులో విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్


 ఫార్ములా ఈ రేసులో రూ. 50  కోట్ల అవినీతి వ్యవహారంలో  కేటీఆర్ పైకేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఏసీబీకి అనుమతి  ఇచ్చారు. చాలా రోజుల కిందటే ఏసీబీ అధికారులు గవర్నర్ కు వివరాలు సమర్పించారు. న్యాయ సలహా తీసుకున్న ఆయన చివరికి ఏసీబీకి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


అల్లు అర్జున్‌కు బెయిల్‌ ఇప్పించింది వైసీపీయేనా?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో పాటు జైలు నుంచి విడుదల వెనుక వైసీపీ ప్రమేయం ఉందని సమాచారం. వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సినీ నిర్మాత సిర్గాపుర్ నిరంజన్‌రెడ్డి.. అర్జున్‌కు బెయిల్ తెప్పించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై వైసీసీ అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు మంచు ప్రెస్‌మీట్


మంచు విష్ణు, మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ఈ తరుణంలో శనివారం   ప్రెస్‌మీట్‌ అని విష్ణు చెప్పారు. మంచు కుటుంబంలో గొడవలు గురించి మనోజ్ మీడియా ముందుకు పలుసార్లు వచ్చారు. అయితే విష్ణు ఒక్కసారి మాత్రమే  మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ


ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ ముందుకు రావడం లేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ తాజాగా  సాగునీటి సంఘాల ఎన్నికలనూ బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం సాయంతో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం


 శ్రీకాకుళం జిల్లాలో ఫేక్ కరెన్సీ చెలామణి వ్యవహారం కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  నిందితులు యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ నోట్ల తయారీని నేర్చుకొని వాటిని  ఒడిశా నుంచి తెచ్చి ఇక్కద చెలామణి చేయాలని చూసినట్లు  సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌


ఒకే దేశం- ఒకే ఎన్నికలు` నినాదంతో జ‌మిలికి కేంద్రం రెడీ అయింది. దీనికి సంబంధించిన బిల్లును కేబినెట్ ఓకే చేసింది. ఇక‌, ఇప్పుడు అస‌లు తంటా పార్ల‌మెంటులోనే ఉండ‌నుంది. ఇక్క‌డ ఓకే అవుతుందా? లేదా అనే చ‌ర్చ‌ జరుగుతోంది పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..