YCP argued that the arrest of Allu Arjun was unjust: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ అల్లు అర్జున్ అరెస్టు అక్రమం అని ఖండించంది. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు స్పందించారు. అదే సమయంలో  జగన్‌కు, వైసీపీ నేతలకు ఆస్థాన న్యాయవాదులుగా పేరున్న నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అల్లు అర్జున్ ను జైలుకు వెళ్లకుండా బయటకు తెచ్చేందుకు న్యాయపోరాటం చేశారు. వారి టీం అంతా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ లాయర్లు గతంలో చిరంజీవి సినిమా ఆచార్యకు నిర్మాతలుగా కూడా ఉన్నారు. 


Also Read:  అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?


పుష్ప సినిమా విడుదల సమయంలో కూడా వైసీపీ నేతలు ఆ సినిమాకు మద్దతుగా మాట్లాడారు. అంబటి రాంబాబు విడుదల తర్వాత సినిమా సూపర్ అని రివ్యూ కూడా చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ తో బన్నీకి దూరం ఉందన్న ప్రచారం కారణంగానే ఆయనను తమ దగ్గరకు చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. అల్లు అర్జున్ కు ఎప్పుడు సపోర్టు చేసే అవకాసం వచ్చినా వైసీపీ నేతలు అవసరం ఉన్నా లేకపోయినా ముందే ఉంటున్నారు. ఈ విషయంలో పవన్ ను టార్గెట్ చేస్తున్నామని వారంటున్నారు. 


అలాగే నిరంజన్ రెడ్డి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ మంచి పేరున్న లాయర్. ఆయన తన వృత్తిలో భాగంగా నే అటు జగన్ కు.. ఇటు అల్లు అర్జున్ కోసం కూడా పని చేస్తున్నారని అంతే కానీ వైసీపీకీ సంబంధం లేదని చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం..అల్లు అర్జున్ అరెస్టు నుంచి గరిష్టంగదా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టును టీడీపీకి.చంద్రబాబుకు కూడా ముడి పెడుతున్నారు.                            


అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు తన స్నేహితుడు అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లారు. అప్పట్నుంచి వైసీపీ అల్లు అర్జున్ ను వైసీపీ తమ వాడిగా ప్రచారం చేసుకుంటోంది. 


Also Read: హీరో అల్లు అర్జున్‌ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు


అల్లు అర్జున్  కేసు విషయంలో క్వాష్ పిటిషన్ వేశారు. అయినా అర్జున్ ను అఘమేఘాలపై అరెస్టు చేశారు పోలీసులు. అసలు ఇంత అత్యవసరంగా ఎందుకు అరెస్టు చేశారన్నది సస్పెన్స్‌గా మారింది.  అల్లు అర్జున్ అరెస్టు అయిన ఓ వార్తకు సంబంధించి.. బీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి  సబితా ఇంద్రారెడ్డి తనయుడు మరోసారి పేరు మర్చిపోడని ఇచ్చిన రిప్లయ్ వైరల్ గా మారుతోంది.  ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును అర్జున్ మర్చిపోయిన వీడియో వైరల్ అయింది. దీన్ని బీఆర్ఎస్ నేతలు విపరీతంగా ట్రోల్ చేశారు. అదే కారణం ఏమో అనుకుంటారు. అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు కారణం అంటున్నారు.