Pushpa 2 Hero Allu Arjun Arrest: సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఒకరు ప్రాణం పోయింది.  ఈ ఘటనపై చిక్కడపల్లి పీఎస్ లో కేసు నమోదైంది.. ఈ రోజు బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు..


సంధ్య థియేటర్లో  పుష్ప-2 సినిమా  ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌  సంధ్య థియేటర్‌ వద్ద  జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది.   ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరో అల్లు అర్జున్‌  డిసెంబరు 11 బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. తన రాక కారణంగా తొక్కిసలాటలో భార్య రేవతి మృతి చెందడం. కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంపై  ఎం.భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రాసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం అన్నారు. సినిమా విడుదల సందర్భంగా తాను థియేటర్‌కు రావడం సహజం అని గతంలోనూ చాలాసార్లు హాజరయ్యాను కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదన్నారు. తాను థియేటర్ దగ్గరకు వస్తున్నట్టు థియేటర్‌ నిర్వాహకులకు, ఏసీపీకి సమాచారం ఇచ్చానన్నారు బన్నీ. ఇందులో నిర్లక్ష్యం లేదని ఫిర్యాదుదారు ఆరోపణలు అవాస్తవం అన్నారు.  కేవలం తన రాక వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొనడం సమంజసం కాదన్నారు.ఈ కారణంగా తనపై కేసు నమోదు చేయడం అంటే న్యాయప్రక్రియను దుర్వినియోగపరచడమేనని బన్నీ అభిప్రాయపడ్డారు. ఈ కేసు వల్ల తన పేరు ప్రతిష్ఠలకు, గౌరవానికి భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. తనపై నమోదైన కేసుును కొట్టేయాలని ... అరెస్ట్ సహా విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.  


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ కు ముందురోజైన డిసెంబర్ 4 రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో ప్రదర్శించారు.ఆ థియేటర్లో అభిమానులతో కలసి సినిమా చూసేందుకు వెళ్లారు అల్లు అర్జున్. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సాయితేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.  


డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప2’ అత్యంత వేగంగా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఆరు రోజుల్లో వెయ్యికోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 ప్రభంజనం నడుస్తున్న ఈ టైమ్ లోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ట్రెండ్ అయ్యాయ్. ఈ మేరకు స్పందించిన టీమ్ అల్లు అర్జున్...ఇవన్నీ అసత్య ప్రచారాలే అని..ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఏమైనా కానీ ఆయన టీమ్ మాత్రమే విడుదల చేస్తుందని క్లారిటీ ఇచ్చారు