Morning Top News:


ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ


తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని పొంగులేటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల ఇళ్ల దరఖాస్తులకు సర్వే పూర్తి చేశామని తెలిపారు. ప్రజా పాలనలో అప్లై చేయని వారు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆర్‌వోఆర్ చట్టంపై సూచనలివ్వాలని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అమరావతికి అదిరిపోయే శుభవార్త


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ శుభవార్త చెప్పింది. రూ.15 వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి రూ.20,500 కోట్ల సీఆర్డీఏ ద్వారా పరిపాలనా ఆమోదం తీసుకున్నట్లు కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఇప్పటివరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రూ. 31 వేల కోట్లు టైఅప్ చేశామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు..విమర్శలు


మేడ్చల్  పట్టణంలో 'హైడ్రా' కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. ప్రధాన మార్కెట్ దారిలో అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు ఫుట్‌పాత్‌లను కూల్చివేస్తుండగా.. నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా కూల్చివేతలు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తాము నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకున్నామని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు


మంచు ఫ్యామిలీలో వివాదంలో కొనసాగుతున్న వేళ సినీ నటుడు మోహన్‌బాబు మరో ఆడియోను విడుదల చేశారు. తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని అన్నారు. ‘కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలి. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు జర్నలిస్టులా.. కాదా నాకు తెలియదు. జరిగిన ఘటనకు బాధపడుతున్నా. అతడు నాకు తమ్ముడే’ అని ఆడియోలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 హైదరాబాద్‌లో భారీ దోపిడీ


హైదరాబాద్‌ దోమలగూడ పరిధిలోని అరవింద్ కాలనీలో గురువారం భారీ దోపిడీ జరిగింది. దుండగులు బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల బంగారం చోరీ చేశారు. సినీ ఫక్కీలో వ్యాపారి రంజిత్, అతని సోదరుడు ఇళ్లల్లోకి చొరబడి 10 మంది దుండగులు కత్తులు, తుపాకులతో బెదిరించారు. లాకర్‌లోని 2.5 కిలోల బంగారం, 3 ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీ టీవీ డీవీఆర్ అపహరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


జమిలి ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోదం


కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్రం పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా, గతంలోనే రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు ఆమోదం తెలపడంతో.. గతంలో ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారన్న అంశాన్ని నెటిజన్లు శోధిస్తున్నారు. 1952 నుంచి 1967 వరకు ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడంతో ఈ జమిలి ఎన్నికలు గాడితప్పాయి.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని నెట్టింట చర్చానీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను అల్లు అర్జున్ టీమ్ ఖండించింది. అల్లు పొలిటికల్ ఎంట్రీ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, బేస్‌లెస్ అని తెలిపింది. దయచేసి మీడియా ఇలాంటి వార్తలను ప్రసారం చేయకూడదని అల్లు అర్జున్ టీమ్ రిక్వెస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


తిరుమలలో భారీ వర్షాలు.. టీటీడీ కీలక హెచ్చరిక 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల ధాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో హరిణికి సమీపంలో జారిపడిన బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా వాహనాలు నడపాలని టీటీడీ అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీహరిపాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలు నిలిపేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


తల్లిపై కత్తితో దాడి.. అంతా అసత్యమే


సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. తల్లి ఫోన్ ఇవ్వలేదని ఓ కుమారుడు తల్లిపై కత్తితో దాడి చేశాడనే ప్రచారం సాగుతోంది. ఫ్రీ పైర్ గేమ్ ఆడుతున్న సమయంలో మధ్యలో ఫోన్‌లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ ఇవ్వమని అడిగితే ఆమె గొంతుపై కత్తితో దాడి చేశాడనేది ఆ వార్త సారాంశం. దీనిపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. కదిరి టౌన్‌లో ఇలాంటి సంఘటనేదీ జరగలేదని తెలిపారు. అది ఫేక్ అని అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా గుకేశ్‌


ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ (WCC) విజేతగా భారత యువ సంచలనం గుకేశ్ అవతరించాడు. WCCలో భాగంగా చైనా ప్లేయర్ డింగ్ లిరెన్‌‌తో జరిగిన 14వ రౌండ్‌లో గుకేశ్ విజయం సాధించాడు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..