Massive Robbery In Hyderabad: హైదరాబాద్‌ (Hyderabad) దోమలగూడ పరిధిలోని అరవింద్ కాలనీలో గురువారం భారీ దోపిడీ జరిగింది. దుండగులు బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల బంగారం చోరీ చేశారు. సినీ ఫక్కీలో వ్యాపారి రంజిత్, అతని సోదరుడు ఇళ్లల్లోకి చొరబడి 10 మంది దుండగులు కత్తులు, తుపాకులతో బెదిరించారు. లాకర్‌లోని 2.5 కిలోల బంగారం, 3 ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీ టీవీ డీవీఆర్ అపహరించారు. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గంజాయి డాన్ అరెస్ట్


పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ధూల్‌పేట గంజాయి డాన్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. గంజాయి అమ్మకాలతో రూ.కోట్లకు పడగలెత్తిన అంగూర్‌బాయిపై ధూల్‌పేట ఎక్సైజ్ పీఎస్‌లో 3 కేసులు, మంగళ్‌హట్ పీఎస్‌లో 4 కేసులు, ఆసిఫ్‌నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయి. అయితే, పోలీసులు ఎన్నిసార్లు కేసులు పెట్టినా ఆమె తప్పించుకు తిరుగుతోంది. ఎట్టకేలకు కార్వాన్ ప్రాంతంలో గురువారం ఆమెను ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: Telangana: ఫోన్ చార్జింగ్‌లు కూడా తగ్గించుకోవాల్సినంత పొదుపా ? తెలంగాణ ప్రభుత్వ పిసినారి ఆదేశాలు వైరల్