Telangana government orders to reduce expenses are going viral: తెలంగగాణ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని ఖర్చులు తగ్గించుకోవాలని ఉద్యోగులు, అధికారులకు ఓ సర్క్యూలర్ జారీ చేశారు. అందులో కీలక అంశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. అత్యవసరం అయితే.. అతి తక్కువ రేటు టిక్కెట్లతో ప్రయాణం చేయాలని .. ఇతర ఖర్చులు కూడా అంతే తక్కువగా ఉంచాలని స్పష్టం చేశారు. సెమినార్లు, వర్క్ షాపులు, స్టడీ టూర్లను పూర్తిగా నిషేధించారు.                        

Also Read:  టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు

ఆఫీసు ఫర్నీషింగ్ విషయంలో ఖర్చులకు అనుమతించేది లేదని .. అత్యంత నిరాడంబరత పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఖర్చుల లిమిట్ ను ఖరారు చేశారని ఆ ప్రకారం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఆఫీసు వెహికల్స్ ఉపయోగించే విషయంలోనూ అనేక జాగ్రత్తలను ప్రకటించారు. కొత్త వాహనాల కొనుగోలును పూర్తిగా బ్యాన్ చేశారు. వాహనాలను రీప్లేస్ చేయడానికి కూడా అనుమతి లేదని..తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వాహనాల కొనుగోలు ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు.                 

ఇక కరెంట్ వినియోగం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉపయోగించనప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్లు, లైట్లు ఆపేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వర్క్ అయిన తర్వా ఆఫీసు నుంచి వెళ్లేటప్పుడు ఏ ఒక్కటీ వృధాగా వెలగకూడదన్నారు. అలాగే ఉద్యోగులు వ్యక్తిగత డివైజ్‌లవిషయంలో చార్జింగ్ పెట్టుకున్న తర్వాత అన్ ప్లగ్ చేయాలని సూచించారు. అంటే ఫోన్ అప్పుడూ చార్జింగ్ పెట్టుకోవద్దని సలహా ఇచ్చారు.                                                               

Also Read : Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు