Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?

Miss You Movie Review in Telugu: సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా 'మిస్ యు'. 'అమిగోస్', 'నా సామి రంగ' ఫేమ్ ఆషికా రంగనాథ్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

Siddharth's Miss You Review in Telugu: తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ కొత్త కాదు. 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుగులో చేశారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్. తెలుగులో 'అమిగోస్', 'నా సామి రంగ' సినిమాలు చేశారు ఆవిడ. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'మిస్ యు'. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు (డిసెంబర్ 13న) విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? పాట్నాలో జరిగిన 'పుష్ప 2 ది రూల్' ట్రైలర్ వేడుక మీద సిద్ధార్థ్ చేసిన జేసీబీ కామెంట్స్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ కొందరు ఆగ్రహంగా అన్నారు. ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుందా? అసలు సినిమా ఎలా ఉంది?

Continues below advertisement

కథ (Miss You Story): దర్శకుడు కావాలని తిరిగే చెన్నై యువకుడు వాసు (సిద్ధార్థ్). ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. వాసుకి ఇంటర్మీడియెట్ మెమరీ లాస్ ఏర్పడుతుంది. యాక్సిడెంట్ జరగడానికి ముందు రెండేళ్లు ఏమైందో మార్చిపోతాడు. అయితే అతని దగ్గర ఆ విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులు దాచి పెడతారు. వాసు కూడా హ్యాపీగా తిరుగుతాడు.

బెంగళూరు వెళ్ళిన వాసు అక్కడ సుబ్బలక్ష్మి (ఆశగా రంగనాథ్) చూసి ప్రేమలో పడతాడు. ఆ విషయం ఆమెకు చెబితే రిజెక్ట్ చేస్తుంది. ఇంట్లో విషయం చెప్పి సంబంధం మాట్లాడమని తల్లిని అడుగుతాడు. అయితే సుబ్బలక్ష్మితో పెళ్లి వద్దని తల్లితో పాటు స్నేహితులు చెబుతారు.

వాసుకి యాక్సిడెంట్ కావడానికి ముందు సుబ్బలక్ష్మితో పరిచయం ఉందా? ఆమెతో ఎందుకు పెళ్లి వద్దని చెబుతున్నారు? మంత్రి చిన రాయుడు (శరత్ లోహితస్వ), ఆయన మనుషులు సుబ్బలక్ష్మిని ఎందుకు బెదిరిస్తున్నారు? చంపాలని చూస్తున్నారు? కోర్టులో ఉన్న కేసు ఏమిటి? అది తెలిసి సిద్ధార్థ్ ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Miss You Telugu Review): మనకు తెలిసిన క్యారెక్టర్లు, లాస్ట్ ఇయర్ తెలుగులో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో మెయిన్ ట్విస్ట్ కలిపితే 'మిస్ యు'. అటు క్యారెక్టర్లు కొత్తగా లేక, ట్విస్ట్ కూడా గెస్ కొట్టేలా ఉండటంతో 'మిస్ యు' మొదటి నుంచి నీరసంగా, నిదానంగా సాగుతుంది.

'మిస్ యు' సినిమా ప్రారంభం బావుంది. కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కానీ అది ఎంతో సేపు ఉండదు. మినిస్టర్ హీరోకి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? ఆ తర్వాత హీరో యాక్సిడెంట్ వంటివి నెక్స్ట్ ఏదో జరగబోతుందని హోప్ ఇస్తాయి. ఆ ఆశలు నీరు కారడానికి ఎంతో సమయం పట్టలేదు. దర్శకుడు ఎన్ రాజశేఖర్ వెంటనే ఫోకస్ షిఫ్ట్ చేశారు. 'మిస్ యు'ని ఓ సాదాసీదా కథ చేసేశారు. హీరో ఓ సిటీకి వెళ్లడం, అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రపోజ్ చేయడం వంటివి రెగ్యులర్ రొటీన్ సన్నివేశాలే. ట్విస్ట్ ఇంతకు ముందు మరో సినిమాలో చూడటడంతో పాటు గెస్ చేసేలా ఉండటంతో అసలు ఎగ్జైట్ చేయదు. సెకండాఫ్ ఏంటి? ఆ కేసు ఏమిటి? అనే హింట్స్ ముందు అర్థం అవుతాయి.

'మిస్ యు'లో మెయిన్ ప్రాబ్లమ్ హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు. కొంతలో కొంత హీరోయిన్ కాస్త భయస్తురాలని బస్ సీన్ (యూట్యూబ్‌లో స్నీక్ పీక్ విడుదల చేశారు) ద్వారా అర్థం అవుతుంది. కానీ, కొన్ని సన్నివేశాలు చూస్తే హీరో ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు? వేరొకరి కోసం హీరోయిన్‌ని అలా అంటాడా? అని సందేహం కలుగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథను కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ ప్రేమను ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయలేదు. కథలో చాలా ప్రశ్నలు వదిలేశారు. చివరలో చెప్పే జపనీస్ కోట్ బావుంది. కానీ, అందుకు తగ్గ కథ కథనాలు లేవు.

హీరోకి ముందు నుంచి సామాజిక సృహ ఉన్నట్టు చూపిస్తే బావుండేది. దర్శక రచయితలు అటువంటిది చేయలేదు. దాంతో కోర్ ఎమోషన్ అనేది కనెక్ట్ కాదు. మధ్య మధ్యలో కరుణాకరన్, మిగతా ఆర్టిస్టులు వేసిన కొన్ని వన్ లైనర్స్ పేలాయి. నవ్వించాయి. కానీ, క్లైమాక్స్ తప్ప మిగతా ఎమోషనల్ సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?

కథ, సన్నివేశాల్లో కంటెంట్ వీక్ అయినప్పటికీ... జిబ్రాన్ మ్యూజిక్ మాత్రం స్ట్రాంగ్ ఫీల్ ఇచ్చింది. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. అలాగే, సినిమాటోగ్రఫీ కూడా! మెజారిటీ సినిమా అంతా ఒక గేటెడ్ కమ్యూనిటీ, మరొక ఇంటిలో జరిగినా... ప్రేక్షకుల మనస్సులో అటువంటి ఆలోచన రాకుండా తీశారు. లైటింగ్ ప్యాటర్న్ బావుంది. ప్లజెంట్ ఫీల్ ఇచ్చింది. యాక్షన్ సీన్లు ఓకే. 

నటుడిగా సిద్ధార్థ్ (Siddharth Miss You Review)కు వంక పెట్టలేం. వాసు పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. 'మిస్ యు'లో కంటే తెలుగు సినిమాల్లో ఆషికా రంగనాథ్ చాలా బావున్నారు. ఆమెను తెలుగు దర్శకులు అందంగా  చూపించారు. క్లైమాక్స్ సీన్‌లో ఆమె నటన బావుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన జయప్రకాశ్, శరత్ లోహితస్వ (అఖండ ఫేమ్) అతిథి పాత్రల తరహాలో తళుక్కున మెరిశారు. మిగతా క్యారెక్టర్లలో రిజిస్టర్ అయ్యేవి తక్కువ. హీరో ఫ్రెండ్ రోల్ చేసిన వాళ్ళు ఓకే. 

'మిస్ యు' క్లైమాక్స్‌లో హీరోయిన్‌తో హీరో ఓ మాట చెబుతాడు... తేడాలు చూడటం లేదని! ఆ క్యారెక్టర్ చూడకపోవచ్చు. కానీ, ప్రేక్షకులు తప్పకుండా కొత్త, పాత తేడాలు చూస్తారు. ఎమోషన్స్ ఎప్పుడూ ఒక్కటే. అందుకని, కథ కొత్తగా ఉందా? ట్విస్టులు కొత్తగా ఉన్నాయా? అని! ఆ కొత్తదనం లేనప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఆ లిస్టులో 'మిస్ యు' చేరుతుంది, నో డౌట్!

Also Readరోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?

Continues below advertisement