మంచు కుటుంబంలో కలహాలు, తండ్రీ కొడుకులు - అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలిసినవే. ప్రతి ఒక్కరికీ వివరంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలో మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన ట్వీట్ అందరిలో ఆసక్తి కలిగింది.
శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌మీట్...
''నా మనసుకు దగ్గరైన ఓ విషయం గురించి రేపు (అంటే శనివారం, డిసెంబర్ 14) మధ్యాహ్నం 12 గంటలకు నేను అనౌన్స్ చేయబోతున్నాను'' అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. దాంతో ఆయన ఏం చెబుతారు? ఏం చెప్పబోతున్నారు? అని ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన మొదలైంది.
మోహన్ బాబు బెయిల్... గొడవలు... ఏం చెప్తారు?
మంచు కుటుంబంలో గొడవలు గురించి మనోజ్ మీడియా ముందుకు పలుసార్లు వచ్చారు. అయితే విష్ణు ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు. అదీ మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఓ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి మీద మోహన్ బాబు చెయ్యి చేసుకున్నారనే అంశంతో పాటు పలు విషయాల గురించి మాట్లాడారు. కానీ, ఆ తర్వాత ఆయన మీడియాతో ఏం చెప్పలేదు.
Also Read: ఒక్కర్నే బాధ్యుణ్ణి చేస్తే ఎలా? అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సెలబ్రిటీలు వీళ్లే
మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి మీద మోహన్ బాబు చెయ్యి చేసుకున్నది కేసు అయ్యింది. అందులో బెయిల్ నిరాకరించారని వార్తలు వచ్చాయి. మరి ఆ కేసు గురించి విష్ణు స్పందిస్తారా? లేదంటే మరొక అంశమా? అనేది చూడాలి.
'కన్నప్ప' విడుదల గురించి చెబుతారా?
విష్ణు మంచు హీరోగా నటించిన కొత్త సినిమా 'కన్నప్ప'. తొలుత డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఆ సినిమా గురించి ఏమైనా చెబుతారా? అనేది చూడాలి.
Also Read: మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?