Telangana Governor has given permission for KTR investigation in this case: ఫార్ములా ఈ రేసులో రూ. 50 కోట్ల అవినీతి వ్యవహారంలో కేటీఆర్ పైకేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఏసీబీకి అనుమతి ఇచ్చారు. చాలా రోజుల కిందటే ఏసీబీ అధికారులు గవర్నర్ కు వివరాలు సమర్పించారు. న్యాయ సలహా తీసుకున్న ఆయన చివరికి ఏసీబీకి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉది. అరెస్టుకు కూడా గవర్నర్ అనుమతి ఇచ్చినట్లేనని భావిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రేస్‌లో రూ.55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా తరలించారు. ఐఏఎస్‌లు సహా అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. నుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ వెంటనే విచారణ ప్రారంభించింది.
మున్సిపల్ శాఖ నుంచి నిధులు మాయమయ్యాయి. ఓ విదేశీ సంస్థకు వెళ్లాయి. ఆ విదేశీ సంస్థకు చెల్లించాల్సిన అవసరమే లేదు. చెల్లించేందుకు ఆర్థికశాఖ అనుమతి.. కేబినెట్ అనుమతి లేదు. పూర్తిగా ప్రజాధనం లెక్కల్లో లేకుండా పోయింది. ఇది పూర్తిగా నిధుల స్వాహా అనే అభిప్రాయం కల్పిస్తుంది. అందుకే ఏసీబీ కేసు నమోదు చేసింది. సీరియస్ నేరం కావడం పక్కాగా సాక్ష్యాలు ఉండటంతో విచారణకు పిలిచి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గవర్నర్ అనుమతి లభించడంతో కీలక పరిమామాలు ఉంటాయని భావిస్తున్నారు.