CM Chandrababu Released 2047 Vision Document: వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఏపీ సాకారమే లక్ష్యమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులు పాల్గొన్నారు. 'పది సూత్రాలు.. ఒక విజన్' పేరిట 'స్వర్ణాంధ్ర @ 2047' (Swarnandhra 2047) విజన్ డాక్యుమెంట్‌ను శుక్రవారం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇది జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు.

Continues below advertisement


'సరికొత్త చరిత్రకు నాంది'


స్వర్ణాంధ్ర విజన్ 2047.. రాష్ట్ర దిశ, దశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 'డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది. వైసీపీ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలం.' అని పేర్కొన్నారు.




'ప్రతీ ఇంటి నుంచి పారిశ్రామికవేత్త..'


విజన్ 2047లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 'అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం.. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారుకావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. పీ4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. మానవ వనరులను అభివృద్ధి చేస్తాం. నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే కరవు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్‌లో చేర్చాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read: YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు