New Year Prediction 2025 Yearly Horoscope for Cancer: నూతన సంవత్సరం 2025లో కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మొదటి మూడు నెలలు కన్నా ఏప్రిల్ నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ ఏడాది మీరు అష్టమ శని నుంచి విముక్తి పొందుతారు. ఫలితంగా అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఈ ఏడాది నూతన పెట్టుబడులకు అనుకూల సమయమే కానీ రిస్క్ చేయకండి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు ఏడాది ప్రధమార్థంలో పరిష్కారం అవుతాయి. ఈ ఏడాది మొత్తం అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. కేతువు ప్రభావంతో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి, సోమరితనం వీడాలి.. వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు.
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
- కొత్త ఏడాది 2025లో ఉద్యోగులకు పని ఒత్తిడి, చికాకులు తప్పవు కానీ ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకున్నా కలిసొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
- విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు.
- వ్యాపారులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోకుండా నూతన పెట్టుబడులు పెట్టొద్దు.
- రాజకీయాల్లో ఉండేవారు కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.
Also Read:
జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకూ కర్కాటక రాశివారికి ఏ నెలలో ఎలా ఉంటుంది...
జనవరి 2025
ఏడాది ఆరంభం లో మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన పనుల్లో ఆంటకాలు, చిక్కులు , ఊహించని పరిణామాలు తప్పవు. సోదరులతో విరోధం, అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. నెలాఖరుకి పరిస్థితిలో కొంత మార్పు ఉంటుంది.
ఫిబ్రవరి 2025
ఫిబ్రవరిలోనూ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి..అనారోగ్య సమస్యలు తప్పవు. స్థానమార్పులు, గృహమార్పులు ఉంటాయి. నూతన వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మార్చి 2025
గడిచిన రెండు నెలలు వెంటాడిన ఇబ్బందుల నుంచి మార్చిలో కొంత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చిన్న చిన్న చికాకులున్నా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది
ఏప్రిల్ 2025
ఏప్రిల్ నుంచి కర్కాటక రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. శని కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించడంతో అష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నెలలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఒడిదొడుకులు తప్పవు
మే 2025
మే నెలంతా మీరు సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలు కలిసొస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోకతప్పదు.
జూన్ - జూలై 2025
జూన్- జూలై నెలలు మీకు అంత అనుకూల ఫలితాలు లేవు. విద్య, వృత్తి, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి.
ఆగస్టు - సెప్టెంబర్ 2025
ఈ రెండు నెలలు కొంత పర్వాలేదు. ఎప్పటి నుంచో ఆగిన పనులు పూర్తవుతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ మీ ప్రవర్తన ఇతరులను బాధపెడుతుంది. నిద్రలేమి సమస్యలుంటాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి.
అక్టోబర్ - నవంబర్ 2025
ఈ రెండు నెలలు ఆర్థిక పరిస్థితి అనకూలంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి కానీ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. రాజకీయాల్లో ఉండేవారు నూతన పదవుల కోసం ప్రయత్నిస్తారు.
Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!
డిసెంబర్ 2025
కొత్త ఏడాది ఆఖర్లో అన్నీ మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. గృహంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. వ్యాపారంలో నూతన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.