New Year Prediction 2025 Yearly Horoscope  for Taurus:  కొత్త ఏడాది 2025 వృషభ రాశి వారికి అనేక విషయాలలో శుభప్రదంగా ఉంటుంది. 2024 సంవత్సరంలో  బృహస్పతి గ్రహం .. శత్రు రాశి అయిన వృషభరాశిలో సంచరిస్తోంది. ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ 2025లో బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా వృషభ రాశివారికి అన్నీ శుభాలే. 2024లో ఎదుర్కొన్న చాలా సమస్యల నుంచి  ఈ ఏడాది మీరు ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది.


జనవరి 2025


ఏడాది ఆరంభంలో వృషభ రాశివారికి వృత్తి ఉద్యోగాల్లో శుభఫలితాలు సాధిస్తారు. అయితే పురోగతి నెమ్మదిగా ప్రారంభమై ఆ తర్వాత జోరందుకుంటుంది. ఊహించనంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు, ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.


ఫిబ్రవరి 2025


కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. ఈ రాశి వృద్ధులకు అనారోగ్య సమస్యలున్నాయి. ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి. మీ మంచి కోసం చెప్పేవారి సలహాలు మీకు నచ్చవు కానీ..ఆ తర్వాత అవే సరైనవి అనిపిస్తుంది..


Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!


మార్చి 2025


నూతన ఉద్యోగ ప్రతిపాదనలు అందుకుంటారు. ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇదే సరైన సమయం. 


ఏప్రిల్ 2025


ఈ నెలలో కూడా వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుట్రలకు దూరంగా ఉండాలి


మే 2025


బృహస్పతి సంచారం వృషభ రాశివారి జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది. మే నెలలో వృషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. 


జూన్ 2025


ఈ నెలలో నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అవివాహితులకు వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. 


Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!


జూలై 2025


లో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి 


ఆగష్టు 2025


ఈ నెలలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది 


సెప్టెంబర్ 2025‌


ఈ నెలలో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి మరమ్మతుల కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తారు. నూతన ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆలోచన  కార్యరూపం దాల్చుతుంది. కుటుంబ సభ్యులపట్ల ప్రేమ చూపిస్తారు.


అక్టోబర్ 2025


ఈ నెలలో వృషభ రాశివారు వివాదాల నుంచి బయటపడతారు. శుభవార్త అందుకుంటారు. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. 


నవంబర్ 2025


నవంబర్ లో మీరు వృత్తి ,  ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉండవచ్చు. మీకు సన్నిహిత మిత్రుడు లేదా బంధువు ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు  వింటారు


డిసెంబర్ 2025


ఈ నెలలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి.  అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. 


Also Read:  ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.