Sun Transits Sagittarius 16 Dec 2024 till 14 Jan 2025: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా సూచిస్తారు. ప్రత్యక్షదైవంగా పూజలందుకునే ఆదిత్యుడు నెల రోజులకు ఓ సారి రాశి పరివర్తనం చెందుతాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సూర్యుడు..డిసెంబరు 16న ధనస్సు రాశి (Sagittarius) లోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు ధనుస్సంక్రాంతి..ఇక జనవరి 14న ధనస్సు నుంచి మకర రాశి (Capricorn ) లోకి అడుగుపెడతాడు. ఆ రోజే మకర సంక్రాంతి (Makar Sankranti 2025). సూర్య సంచారం నెలకోరాశిలో ఉండడం వల్ల ఏటా మకర సంక్రాంతి తేదీల్లో మార్పులుండవు.
దేవతల గురువైన బృహస్పతి ( Jupiter) అధిపతిగా ఉన్న ధనస్సు లోకి సూర్యుడు రాశి పరివర్తనం చెందడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులవారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,విద్య, వ్యక్తిగత జీవితంలో శుభఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీకు అన్నివిధాలుగా కలిసొస్తుంది...
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కోర్టు సంబంధిత కేసుల్లో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి కలిసొచ్చే టైమ్ ఇది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి.ఆర్థికలాభం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు.
సింహ రాశి (Leo Horoscope Today)
ధనుస్సు రాశిలో సూర్యుని పరివర్తనం సింహ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడంతో మీపై ఆదిత్యుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ధనస్సు సూర్య సంచారం ఉన్నన్నిరోజులు మీకు అన్నింటా శుభఫలితాలే ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచ ఉపశమనం లభిస్తుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంటా బయటా కలిసొచ్చే సమయం ఇది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు శుభసమయం
Also Read: మార్గశిర మాసం నెల రోజులు నిత్యం పఠించాల్సిన స్తోత్రం!
తులా రాశి (Libra Horoscope Today)
సూర్యుడి రాశి పరివర్తనం తులారాశి నుంచి మూడో స్థానంలో ఉంటోంది. ఫలితంగా అన్నీ శుభఫలితాలే. అన్నీ సానుకూల ఆలోచనలు నిండి ఉండాయి. అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనులును అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న టైమ్ కి పూర్తిచేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు.
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.