KTM 250 Duke Bike on Discount: యూరోపియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ కేటీయం యొక్క బైక్‌లపై యువతలో మంచి క్రేజ్ ఉంది. కంపెనీ భారతీయ మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లకు మంచి పేరు పొందింది. అయినప్పటికీ అధిక బడ్జెట్ కారణంగా చాలా మంది యువత ఈ బైక్‌లను కొనుగోలు చేయలేకపోతున్నారు.


మీరు ఈ బైక్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే, ఈ అవకాశం మీకు సరైనది అని చెప్పవచ్చు. కేటీయం కంపెనీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 250 సీసీ మోటార్‌సైకిల్ అయిన కేటీయం 250 డ్యూక్ కోసం సంవత్సరం చివరిలో భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు మీరు రూ. 2.25 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కేటీయం బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. 


ఎంత తగ్గింపు లభిస్తుంది?
ఈ బైక్ అసలు ఎక్స్ షోరూం ధర రూ. 2.45 లక్షలు కాగా ప్రస్తుతం రూ.2.25 లక్షలకే అందుబాటులో ఉంది. అంటే ఏకంగా రూ.20 వేలు తగ్గిందన్న మాట. ఈ తగ్గింపు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి మరింత సమాచారం కోసం మీరు మీ సమీప షోరూమ్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.



Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!


కేటీయం 250 డ్యూక్ బైక్‌లో 249.07 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్ 9,250 ఆర్పీఎం వద్ద 30.57 బీహెచ్‌పీ పవర్‌ని, 7,250 ఆర్పీఎం వద్ద 25 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజిన్‌తో పాటు 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా అందించారు. ఇందులో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది.


కేటీయం డ్యూక్ బైక్ ఫీచర్లు
ఈ కేటీయం బైక్ ముందు చక్రం 320 మిల్లీమీటర్లు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. వెనుక చక్రం ఫ్లోటింగ్ కాలిపర్‌లతో 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. బైక్‌లో సూపర్‌మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్ ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్ అప్‌డేటెడ్ వెర్షన్ మునుపటి మోడల్ మాదిరిగానే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.



Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?