5 Cars That Can Cover Over 1000 Kms: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రతి ఒక్కరూ మంచి మైలేజీని ఇచ్చే కారును పొందాలని కోరుకుంటారు. కానీ అటువంటి కార్లు ఏవో తెలుసుకోవడం మీకు పెద్ద పని అవుతుంది. ఒకసారి ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల ఐదు కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హ్యుందాయ్ క్రెటా డీజిల్ (Hyundai Creta Diesel)
ఈ లిస్ట్‌లో మొదటి కారు హ్యుందాయ్ క్రెటా డీజిల్. దీని ధర రూ. 12.55 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ హ్యుందాయ్ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది లీటరుకు 21.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
హ్యుందాయ్ క్రెటా మూడు 1.5 లీటర్ ఇంజన్ వేరియంట్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 50 లీటర్ ట్యాంక్‌తో ఈ కారు ఏకంగా 1090 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
Also Read: కోటి రూపాయల వోల్వో ఎక్స్‌సీ90 - ఈఎంఐలో కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?
టయోటా ఇన్నోవా హైబ్రిడ్ (Toyota Innova Hybrid)
రెండో కారు అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్ లీటరుకు 21.1 కిలోమీటర్ల మైలేజీని కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 19.77 లక్షలుగా ఉంది. ఈ టయోటా కారు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ అయితే 1,097 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
ఈ టయోటా కారు మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లతో పోటీ పడుతోంది. కంపెనీ తెలుపుతున్నద దాని ప్రకారం ఈ కారు మైలేజ్ లీటరుకు 16.13 కిలోమీటర్ల నుంచి 23.24 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మీరు ఈ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కూడా పొందుతారు.
మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto)
మూడవ కారు మారుతి సుజుకి ఇన్విక్టో. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఇది లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 52-లీటర్ ఇంధన ట్యాంక్ ఉన్న ఈ కారును ట్యాంక్ ఫుల్ చేస్తే 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఈ మారుతి కారును రూ. 25.11 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
హోండా సిటీ ఈ:హెచ్ఈవీ (Honda City e:HEV)
ఇది కాకుండా మీరు హోండా సిటీ ఈ:హెచ్ఈవీని కూడా కొనుగోలు చేయవచ్చు, దీని మైలేజీ లీటరుకు 27.13 కిలోమీటర్లుగా ఉంది. ట్యాంక్ నిండిన తర్వాత ఈ కారు 1085 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. మీరు దీన్ని రూ. 19.04 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara)
మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ లీటరుకు 27.93 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇది ఫుల్ ట్యాంక్‌పై 1257 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. మీరు ఈ కారును రూ. 10.87 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!