Shani Gochar 2025: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!

Saturn Transit in Pisces: కొత్త ఏడాదిలో శని మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు.. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. మూడు రాశులవారికి కొత్త కష్టాలు మొదలవుతాయి

Continues below advertisement

Shani Gochar 2025: రెండున్నరేళ్లకోసారి రాశి మారే శని 2024 మొత్తం కుంభ రాశిలోనే పరివర్తనం చెందాడు. 2025లో కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యశాస్త్రంలో శని సంచారాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తారు.

Continues below advertisement

శని మంచి స్థానంలో ఉంటే అన్నీ శుభాలే..కానీ.. శని జన్మంలో, నాలుగు, ఎనిమిది, దశమం స్థానాల్లో ఉంటే ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని చెబుతారు. ఈ సమయంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు ఉండవు, ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. చేపట్టిన పనులన్నీ పూర్తైనట్టే ఉంటాయి కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతాయి. సమయానికి డబ్బు చేతిలో లేకపోవడం, ఊహించని ఖర్చులు ఉంటాయి. మంచి మాట్లాడినా చెడుగానే మారుతుంది. కుటుంబంలో, ఉద్యోగం, వ్యాపారంలో చికాకులుంటాయి. అయితే శని సంచారం శుభస్థానంలో లేనప్పటికీ శుక్రుడు, బృహస్పతి సంచారం బావుంటే శని ప్రభావం ఉన్నప్పటికీ సక్సెస్ మీ సొంతం అవుతుంది, ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.  

2025 మార్చి వరకూ కుంభ రాశిలో సంచరించే శని ఆ తర్వాత నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం చాలా రాశులవారికి మంచి చేస్తుంది. మకర రాశివారికి శని నుంచి విముక్తి లభిస్తుంది. మేషం, సింహం, ధనస్సు రాశులవారికి కొన్ని ఇబ్బందులు తీసుకొస్తోంది.

Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

మేష రాశి

2025లో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  శని మీనంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ప్రభావం మీపై తీవ్రంగానే ఉంటుంది. మీకు 12వ స్థానంలో శని సంచారం వల్ల వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు తప్పవు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. మిత్రులే శత్రువులు అవుతారు. ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.  వివాదాలకు దూరంగా ఉండాలి. 

సింహ రాశి

2025 మార్చి తర్వాత సింహరాశి వారికి కొత్త కష్టాలు మొదలవుతాయి. మీ రాశినుంచి శని అష్టమంలో సంచరిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లినప్పటికీ శని ప్రభావం మిమ్మల్ని వెనక్కు లాగుతుంది. ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగంలో సవాళ్లు తప్పవు. వ్యాపారం ఒడిదొడుకుల మధ్య సాగుతుంది. శత్రుబాధలు, ఊహించని నష్టాలు తప్పవు.

Also Read:  ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!

ధనస్సు రాశి

ధనస్సు రాశివారిపై కూడా 2025లో శని ప్రభావం ఉంటుంది. మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శని సంచారం ఉంటోంది. ఈ సమయంలో ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండవు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

శని నుంచి ఎవరూ తప్పించుకోలేరు..కానీ ఆ ప్రభావం తగ్గించుకోవచ్చు. శనివారం రోజు శనికి తైలాభిషేకం, జపాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా శని శ్రమకారకుడు..సోమరితనం, బద్ధకాన్ని అస్సలు సహించడు. అందుకే కష్టపడడం, శ్రమకారకులైన చీమలకు ఆహారం వేయడం , మూగజీవాలకు నీటిని అందించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Continues below advertisement
Sponsored Links by Taboola