Royal Enfield Overall Sales Growth: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు యువతలో భిన్నమైన క్రేజ్ ఉంది. ఈ బైక్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించాయి. కంపెనీ గత నెల అంటే 2024 నవంబర్ సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. మనం లెక్కల గురించి మాట్లాడినట్లయితే కంపెనీ వార్షిక అమ్మకాలలో పెరుగుదల ఉంది. దేశీయ అమ్మకాల్లో మాత్రం స్వల్ప క్షీణత లభించింది.
గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తంగా 82,257 యూనిట్లను విక్రయించింది. ఇది 2023 నవంబర్ నెలలో అమ్ముడు పోయిన 80,251 యూనిట్ల కంటే ఎక్కువ. దీంతో పాటు ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కంపెనీ విక్రయ గణాంకాలను కూడా విడుదల చేసింది. ఈ టైమ్ పీరియడ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 5,84,965 యూనిట్లు విక్రయించగా, గతేడాది ఇదే టైమ్ పీరియడ్‌లో 5,72,982 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
దేశీయ మార్కెట్లో విక్రయాలు ఎలా ఉన్నాయి?
ఈ సంవత్సరం నవంబర్‌లో కంపెనీ దేశీయ విక్రయాలలో నాలుగు శాతం క్షీణతను నమోదు చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 72,236 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది 2023 నవంబర్‌లో 75,137 కొత్త మోటార్‌సైకిళ్ల విక్రయాలు జరిగాయి. గతంతో పోలిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగుమతులు పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2024 నవంబర్‌లో మొత్తం 10,021 యూనిట్లను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 5, 114 యూనిట్లుగా ఉంది.
కంపెనీ ఒకదాని తర్వాత ఒకటి కొత్త బైక్‌లను విడుదల చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అద్భుతమైన బైక్‌ను డిసెంబర్‌లో విడుదల చేయనుంది. బ్రిటిష్ వాహన తయారీదారులు డిసెంబర్ 15వ తేదీన బుల్లెట్ 650ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేయనున్న ఈ బైక్ 650 సీసీ ఇంజన్‌తో లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ 650 మూడు లక్షల రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్లోకి రావచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు మనదేశంలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ బైక్ కూడా సూపర్ హిట్ అయ్యేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!