Top 10 Headlines Today:


బీజేపీ ఏం సమాధానం చెప్పింది ?


జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు. ఓట్లు చీలనివ్వబోమన్న తమ వ్యూహాన్ని నొక్కి చెప్పారు. అదే సమయంలో కలసి రావాలని బీజేపీని కోరడానికే ఢిల్లీ వెళ్లానని పవన్ కల్యాణ్ తొలి సారి నేరుగా చెప్పారు. అక్కడ బీజేపీ స్పందన ఏమిటన్నది మాత్రం పవన్ కల్యాణ్ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్  బీజేపీ కలసి వస్తుందా ? అసలు పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై బీజేపీ అగ్రనేతలు ఏమన్నారు ?  ఏపీ రాజకీయాలపై వారిలో ఎలాంటి చర్చ జరుగుతోంది ? 


కేసీఆర్‌పై కుమారస్వామి అసంతృప్తిగా ఉన్నారా ?
కర్ణాటక  ఎన్నికల్లో పోలింగ్ ముగిసీ ముగియక ముందే జేడీఎస్ నేత కుమారస్వామి ఓ నిరాశజనకమైన ప్రకటన చేశారు.  తమకు డబ్బులు లేకపోవడం వల్ల కనీసం పాతిక సీట్లలో గెలవలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న కుమారస్వామి ఇలా ఆర్థిక పరమైన అంశాలపై ఎందుకు పోలింగ్ ముగియగానే మాట్లాడారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. బీఆర్ఎస్ వైపు నుంచి అందుతుందనుకున్న సహకారం అందకపోవడం వల్లనే ఆయన ఈ అసంతృప్తి వ్యక్తం చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


కోల్‌కతా పాలిట యముడిలా మారిన యశస్వి


ఐపీఎల్‌ 2023 సీజన్ 56వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర ఓటమి పాలైంది. ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ కేవలం 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఐదు నెలలు ఆగితే...
తెలంగాణ ప్రజలు ఇంకో ఐదు నెలలు ఓపిక పట్టాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నీడ లేని పేద ప్రజలు అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల (Double Bed Room Houses) కేటాయింపులో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు (మే 11) కూకట్ పల్లి మూసాపేటలో బీజేపీ నేతలు నిర్వహించిన ‘‘ఆత్మగౌరవ దీక్ష’’లో బండి సంజయ్‌ (Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆత్మగౌరవ దీక్ష చేస్తున్న బీజేపీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ప్రభాస్ కు షాక్.. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జూన్ లో భారీ ఎత్తున థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన తర్వాత, ట్రైలర్ రాకతో ఇన్నాళ్లకు ఈ మూవీపై ఓ పాజిటివ్ బజ్ వచ్చింది. అయినా సరే ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం వదిలేలా కనిపించడం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


తీవ్ర వాయుగుండం 


నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నేడు ఉదయం 5:30 కి అదే ప్రదేశంలో మోచా తుపానుగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తుపాను సుమారుగా ఉత్తర - వాయవ్య దిశ వైపుగా కదులుతూ క్రమంగా బలపడి ఈ రోజు రాత్రికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. తరువాత తన దిశను మార్చుకొని ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతూ 12వ తారీకు ఉదయానికి, మధ్య  బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ 13వ తేదీ సాయంత్రానికి బాగా బలపడే అవకాశం ఉంది.  ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాల మధ్యలో Cox's Bazar (బంగ్లాదేశ్) & kyaukpyu (మయన్మార్) మధ్యలో సిట్ట్వె (SITTWE)కి అతి సమీపంలో 14వ తేదీ మధ్యాహ్నం గాలి వేగం 140-150 కి.మీ. (maxwind 165 కి మీ) తో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


కోర్టులో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారు: సుప్రీంకోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా అక్రమేనని తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్ హైకోర్టులో ఉండగానే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో భయానక వాతావరణం సృష్టించారంటూ మండి పడ్డారు. కోర్టులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. ఎవరినైనా సరే కోర్టులో అరెస్ట్ చేయడం అక్రమం అని తేల్చి చెప్పింది. గంటలోగా ఇమ్రాన్‌ ఖాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఇమ్రాన్‌ ఖాన్ కోర్టుకి వచ్చే సమయంలో రాజకీయ నేతలు కానీ, కార్యకర్తలు కానీ కోర్టులోకి రావద్దని హెచ్చరించారు చీఫ్ జస్టిస్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


కార్ల బిజినెస్‌లోకి రిలయన్స్‌!
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టనుందా! ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది! అన్ని సవ్యంగా కుదిరితే ఎంజీ మోటార్స్‌లో వాటా కొనుగోలు చేయొచ్చని సమాచారం! చైనీస్‌ ఆటో కంపెనీ ఎస్‌ఏఐసీకి చెందిన ఎంజీ మోటార్స్‌ తన వ్యాపారంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్విటీ వాటాలను అమ్మేందుకు కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హీరో గ్రూప్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఉన్నాయని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గురువారం రిపోర్ట్‌ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఏపీ సర్కారుకు ఎన్జీటీ షాక్ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ -ఎన్‌జీటీ భారీ జరిమానా విధించింది. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన నేషననల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులను సైతం జాతీయ హరిత ట్రైబ్యునల్ రద్దు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్‌ఐ పోస్టులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (పేపర్-2) పోస్టుల భర్తీకి మే 2న నిర్వహించిన పరీక్ష ప్రాథమిక ఆనర్స్ 'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 11న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి