మే 12 రాశిఫలాలు


మేష రాశి
ఈ రోజు మీ రోజు శుభప్రదంగా  ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ ఆలోచనలను త్వరగా కార్యాచరణలో పెట్టగలుగుతారు కానీ ఏదో గందరగోళం ఉంటుంది.  వ్యాపారులు, ఉద్యోగులు కొన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  నిర్దిష్ట పని కోసం మరింత ప్రయత్నిస్తారు. ఈరోజు మాటల విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. కొత్త పనిలో లాభం ఉంటుంది 


వృషభ రాశి 
తలపెట్టిన పనిలో కొన్ని ఆంటకాలు ఎదురవుతాయి. చాలా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ పనిలో తొందరపాటు చూపించవద్దు. ఈరోజు ఏదైనా కొత్తపని ప్రారంభించడానికి మంచిది కాదు. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి. నూతన పెట్టుబడులు పెట్టొద్దు నష్టపోతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.


మిథున రాశి
ఈ రోజు మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఈ రోజు మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తారు. ఈరోజు మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అధిక వ్యయాన్ని నియంత్రించండి. మీ మనస్సు నుంచి ప్రతికూల ఆలోచనలను తొలగించండి. 


Also Read: సూర్యాంజనేయం అంటారెందుకు - సూర్యుడు-ఆంజనేయుడు మధ్య ఉన్న బంధం ఏంటి!


కర్కాటక రాశి
ఈ రోజు మీరు అనారోగ్యంగా ఉంటారు. గందరగోళం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. బంధువులతో విభేదాలు రావచ్చు. ఇంటి పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవద్దు...కొన్ని సమస్యలు ఎదురవుతాయి. 


సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. మనసులో చాలా ఆలోచనలు సుడులు తిరుగుతాయి.  ఈరోజు కొత్త పనులు ప్రారంభించవద్దు. వ్యాపారంలో లాభం ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి.


కన్యా రాశి 
ఈ రోజు మీరు కొత్త పని ప్రణాళికలను అమలు చేయగలుగుతారు. వ్యాపార, ఉద్యోగస్తులకు లాభాలు అందుతాయి. అధికారులు మిమ్మల్ని దయతో చూస్తారు. ఉన్నత పదవిని పొందే అవకాశం ఉంది. కుటుంబం నుండి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార పనుల వల్ల వలస వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది.


తులా రాశి
ఈ రోజు మీరు రచనలు చేయడంలో చురుకుగా ఉంటారు. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి మంచి రోజు.విదేశాల్లో నివసిస్తున్న స్నేహితులు లేదా ప్రియమైనవారి గురించి వార్తలు అందుకుంటారు. వ్యాపారం లేదా ఉద్యోగంలో సహోద్యోగులకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో ఏదో డైలమా ఉంటుంది. శత్రువులతో ఎలాంటి చర్చకు దిగవద్దు.


వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించవద్దు. కోపాన్ని అదుపుచేసుకోవాలి. తప్పులు చేయకండి..ముందు ముందు చాలా నష్టపోతారు. ప్రభుత్వ పనులు జాగ్రత్తగా చేయండి. కొత్త సంబంధాలను ఏర్పరుచుకునేముందు ఆలోచించండి. అధిక వ్యయాన్ని తగ్గించుకోపోతే ఇబ్బందుల్లో పడతారు. పూజలు, జపాల వల్ల ప్రయోజనం ఉంటుంది. 


ధనుస్సు రాశి
ఈ రోజు మీకు సంతోషంగా గడిచిపోతుంది. పార్టీ, పిక్నిక్, ప్రయాణం, రుచికరమైన ఆహారం మరియు షాపింగ్ ఈ రోజులో భాగంగా ఉంటాయి. వివాహిత జంట మధ్య అన్యోన్యత ఉంటుంది. రచనా రంగంలో ఉండే


Also Read: శ్మశానాల్లోకి స్త్రీలు అడుగుపెడితే!


మకర రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార అభివృద్ధికి ఈ రోజు ఫలవంతమైనది. ఆర్థిక లాభం పొందుతారు. మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. శత్రువులను ఓడించగలుగుతారు. ఈరోజు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.


కుంభ రాశి 
ఏ ముఖ్యమైన నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకపోవటం మేలు చేస్తుంది. ప్రయాణాలలో ఇబ్బంది కలగవచ్చు. నిర్ణీత పనిని పూర్తి చేయనందున మీరు నిరాశ చెందుతారు. మనస్సు చంచలంగా ఉంటుంది. శారీరక నొప్పి ఇబ్బంది పెడుతుంది. పిల్లల చదువు విషయంలో ఆందోళన ఉంటుంది.


మీన రాశి
మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధు మిత్రులతో వాదోపవాదాలు జరగవచ్చు. అనేక సమస్యలు , క్లిష్ట పరిస్థితుల కారణంగా, మీ శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎలాంటి డాక్యుమెంటరీ పనిలోనైనా జాగ్రత్తగా ఉండండి. పరువు నష్టం జరిగే అవకాశం ఉంది.