ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్‌ఐ పోస్టులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (పేపర్-2) పోస్టుల భర్తీకి మే 2న నిర్వహించిన పరీక్ష ప్రాథమిక ఆనర్స్ 'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 11న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. మే 13న సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్ విధనాంలో ఆన్సర్ కీ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కోప్రశ్నకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత నమోదుచేసే అభ్యంతరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించరు.


ఆన్సర్ కీపై అభ్యంతరాల నమోదు ఇలా..


Step 1: ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://ssc.nic.in/


Step 2: అక్కడ హోంపేజీలో "Answer Key" ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. 


Step 3: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో "Tentative Answer Keys along with Candidates' Response Sheet(s) for Sub-Inspector in Delhi Police and CAPFs (Paper-II) Examination, 2022" లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 4: లాగిన్ వివరాలు ఉన్న కొత్త పేజీ వస్తుంది. 


Step 5: అక్కడి లాగిన్ పేజీలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి. 


Step 6: వివరాలు నమోదుచేయగానే పరీక్ష ఆన్సర్ కీ, అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు కంప్యూటర్ తెరమీద కనిపిస్తాయి. 


Step 7: ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.


Step 8: ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు "Challenge Answer Key" ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.


Step 9: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో పరీక్ష పేరు, క్వశ్చన్ పేపర్ తేదీ, ఇతర వివరాలు నమోదుచేయాలి. 


Step 10: అభ్యంతరాలు తెలిపే ప్రశ్నను ఎంపిక చేసుకోవాలి. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజుగా చెల్లించాలి.


Step 11: అభ్యంతరాలు నమోదుచేసి 'Submit' చేయాలి. ప్రింట్ తీసుకొని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.


Also Read:


భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు, వివరాలు ఇలా!
జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ జూనియర్ ఓవర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్‌ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు  మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..