Morning Top News:


మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం


మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ , ఆయన భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కొంత మంది బయట వ్యక్తులు తన ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిని తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికనే తీసుకు వచ్చారని కూడా అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


గ్రూపు-2' పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరణ


తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఉన్న అవాంతరం తొలగిపోయింది. పరీక్షలను వాయిదా వేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


టీడీపీలో యనమల లేఖ కలకలం


తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన ఓ లేఖపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండి పడుతున్నారు. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వర్గాలు ఆయన చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందులో ఆయన సామాజికవర్గాల ప్రస్తావన తీసుకు రావడమే సంచలనంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ కు కీలక పదవి


ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు కు ఏపీ క్యాబినెట్‌లో చోటు దక్కడం ఖాయం అయింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఆయన మంత్రి కానున్నట్లు తెలిసింది. నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ అసెంబ్లీ సీట్ల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వీలుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఒకే దేశం, ఒకే ఎన్నికల చట్టం


2029 నాటికి 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'(One Nation One Election) లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల‌్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టవచ్చు. బిల్లును ప్రవేశపెట్టకముందే ప్రతిపక్షాలతో, ముఖ్యంగా కాంగ్రెస్‌తో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో జమిలి ఎన్నికలపై  ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌


ఏపీలో కాకినాడ పోర్టుపై మంత్రులు, అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కేటుగాళ్లు రూటు మార్చారు. విశాఖ పోర్టును స్మగ్లింగ్‌కు కేంద్రంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌ చేశారు. దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వ నజరానా 


ప్రతి ఏడాది తెలంగాణ తల్లి ప్రతిష్టాపన దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన డిసెంబర్ 9న ఈ వేడుక జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 1 కోటి నగదు సాయంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


రోహిత్, షమీ మధ్య విభేదాలు? 


వెటరన్ పేసరల్ మహ్మద్ షమీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ సంబంధాలు అంతా బాగా లేవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ నుంచే వీరిద్ధరి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు ఊహగానాలు చెలరేగాయి. బీజీటీలో అంతగా ఆకట్టకోలేని భారత పేస్ దళాన్ని షమీతో బలోపేతం చేయాలని అభిమానలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ


భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కి ఐసీసీ షాకిచ్చింది. రెండోటెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తో వాదనకు దిగడంతోపాటు మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిందనుకుగాను జరిమానా విధించిది. అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది.  మరోవైపు ఇదే టెస్టులో హెడ్ కూడా ప్రవర్తన నియామవళిని అతిక్రమించినట్లు ఐసీసీ తేల్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు


సిరియా లో అంతర్యుద్ధానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానంగా ఐదు చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ, సమానత్వం,  వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ హక్కుల కోసం  నిరసనలు ఇక్కడి ప్రజల తిరుగుబాటుకు అంతర్గత కారణాలు. వీటితో పాటు,విదేశీ జోక్యం , మత పరమన విబేధాలు, పాలనా తీరు ఇవన్నీ ప్రధాన కారణాలు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..