TGPSC Grop2 Exam: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఉన్న అవాంతరం తొలగిపోయింది. పరీక్షలను వాయిదా వేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు 16, 17 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ జూనియర్‌ ఇంజినీరింగ్‌ (RRB JE) 16, 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. గ్రూప్-2 పరీక్షల వాయిదా కోరుతూ.. కొందమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. ఒకే రోజు రెండు ప్రధానమైన పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయిదావేయాలని కోరారు. అయితే వీటిపై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గ్రూప్-2 పరీక్షలు వాయిదావేయదాకు నిరాకరించింది. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున వాయిదా వేయలేమని హైకోర్టు వెల్లడించింది. గ్రూప్-2 వాయిదా వేయడం వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల..గ్రూప్-2 వాయిదాకు హైకోర్టు నిరాకరించడంతో.. పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. దీంతో గ్రూప్-2 పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ డిసెంబరు 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీతోపాటు పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.  

1,368 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు..రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 8.30 నుంచి, రెండో సెషన్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పేపర్ 1, 3 పరీక్షలు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పేపర్ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. 

పేపర్ అంశం పరీక్ష తేదీ సెషన్
పేపర్‌-1  జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ 15.12.2024 ఉదయం
పేపర్‌-2  హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ 15.12.2024 మధ్యాహ్నం
పేపర్‌-3  ఎకనామిక్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 16.12.2024 ఉదయం
పేపర్‌-4  తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌ 16.12.2024 మధ్యాహ్నం

పరీక్ష విధానం..➥ గ్రూప్-2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ కింద ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

➥ పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌‌పై పరీక్ష మొదటి సెషన్‌లో నిర్వహిస్తారు.

➥ పేపర్‌-2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ పరీక్షను రెండో సెషన్‌లో నిర్వహిస్తారు. పేపర్‌-3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌‌పై ఉండనుంది. ఇది డిసెంబరు 16న మొదటి సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇక పేపర్‌-4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణపై ప్రశ్నలు ఉండగా.. దీన్ని  డిసెంబరు 16న రెండో సెషన్‌లో నిర్వహిస్తారు.

తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి 2022, డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...