Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం

Telangana News తెలంగాణ ఉద్యమంలో కీలక 9 మంది ప్రముఖ రచయితలు, కవులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1 కోటి రూపాయల నగదుతో పాటు ఫ్యూచర్ సిటీలో ఇంటి స్థలం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Continues below advertisement

Revanth Reddy Unveils Telangana Talli Statue at Secratariat | హైదరాబాద్: ప్రతి ఏడాది తెలంగాణ తల్లి ప్రతిష్టాపన దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన డిసెంబర్ 9న ఈ వేడుక జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్ తేజ, గోడిశాల జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 1 కోటి నగదు సాయంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Continues below advertisement

రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే.. చిన్ననాడు తన తల్లిని చూస్తే కలిగిన అనుభూతి కలిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు చేసే రాజకీయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎంతో మంది తనకు చెప్పారన్నారు. తొలి ఏడాదిలోనే ఎన్నో హామీలను నెరవేర్చి, ప్రజల విశ్వాసాన్ని మరోసారి చూరగొన్నామని చెప్పారు. ఉద్యమకారులు, అమరవీరులు తమ గుండెలపై TGని పచ్చబొట్టుగా వేసుకున్నారు, కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక వారి ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం TSగా మార్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్ స్థానంలో TGని ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కవులు, కళాకారులకు సన్మానం

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసిన కొందర్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యం కోసం సర్వం త్యాగం చేసిన కొందరు ప్రముఖులను, కవులు, రచయితల్ని సన్మానించడంతో పాటు వారికి ఆర్థికంగా చేయూత అందించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం సమయంలో అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఓరి రాజిగా అనే పాటు యువతను, విద్యార్థులను ఉద్యమం వైపు నడిపాయి. ఆయనను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గద్దర్ లాంటి గొప్ప వ్యక్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రూ.1 కోటి ఆర్థిక సాయం, ఫ్యూచర్ సిటీలో ఇంటి స్థలం

బండెనక బండి కట్టి పాట రాసి బండి యాదగిరిగా ఫేమస్ అయిన ఆ రచయిత సేవల్ని మనం మరోసారి గుర్తుచేసుకుందాం. ఆయన కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. తెలంగాణ గేయం రచించిన అందెశ్రీతో పాటు గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్ తేజ, గోడిశాల జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు (అమరవీరుల స్థూపం రూపశిల్పి) లాంటి 9 మంది కవులు, రచయితలు, కళాకారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.1 కోటి రూపాయల ఆర్థిక సాయం, తామ్ర పత్రాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, లక్ష మంది తెలంగాణ ఆడపడచులు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీని సన్మానించారు. పూర్తి వివరాలు

Continues below advertisement