కేసీఆర్‌కు కాగల కార్యం బీజేపీ తీర్చేస్తోందా? ఆర్టీసీ విలీనం అడ్డుకుని సాధించేదేంటి ?


తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పడు అనూహ్యంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల గొడవల్లో గవర్నర్ రావడం అనూహ్యంగా మారింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపాల్సినంత అవసరం లేదు. బిల్లులు ఇలా గవర్నర్ వద్దకు వెళ్తే ఎలాంటి కొర్రీలు పెట్టరు. ఎందుకంటే అసెంబ్లీలో  పాస్ అయిన తర్వాత మళ్లీ గవర్నర్ ఆమోదంతోనే గెజిట్ రిలీజ్ చేస్తారు. అభ్యంతరాలు ఉంటే అప్పుడు చెప్పవచ్చు. అసలు అసెంబ్లీలోనే బిల్లు  పెట్టుకుండా ఆపాలనుకోవడంతోనే తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలను రంగంలోకి దింపింది. దీంతో  బీజేపీ మరింత ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయిది. ఇంకా చదవండి


చంద్రబాబుకి, ఏపీ సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్


తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మాజీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో చేప‌ట్టిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని, ఇవ్వాళ తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చంద్రబాబు అన్నారు. ఈ విషయం తాను టీవీలో చూశానని చెప్పారు. హైదరాబాద్ లో కాదు తెలంగాణలో అక్కడి ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉందని, మెడ మీద కత్తి పెట్టినా వాళ్లు మీటర్లు పెట్టడం లేదని చంద్రబాబు అనడం వాస్తవం కాదా అన్నారు. తెలంగాణలో మంచి జరిగిందని చెప్పిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా చదవండి


జగన్ ఇడుపులపాయకు పోతే దరిద్రం పోతుంది: చంద్రబాబు


మరో 2, 3 నెలల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చనున్నారని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అయితే జగన్ రుషికొండకు కాదు... ఇడుపుల పాయకు పోతే దరిద్రం పోతుందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. జగన్ వైజాగ్ వెళితే అక్కడ టీడీపీ మెజారిటీ మూడు రెట్లు పెరుగుతుంది అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ  నేతలు కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు అన్నారు. ఇంకా చదవండి


తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి బాగా తగ్గిపోయిన వర్షాలు - అసలు కారణం ఇదీ


ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (ఆగస్టు 5) ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆగస్టు 9 వరకూ ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. ఇంకా చదవండి


ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భారీ భూకంపం


అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో శ‌నివారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. అఫ్గాన్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. తాజాగా సంభవించిన భూకంప కేంద్రాన్ని తజకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. హిందూకుష్ ప్రాంతంలో ఉత్తరం వైపు 36.38 డిగ్రీల అక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉందని తెలిపారు. ఇంకా చదవండి


ఉల్లి రేటు రెట్టింపయ్యే ఛాన్స్‌ 


దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రేటు రూ. 120 పలుకుతుండగా, మరికొన్ని చోట్ల రూ. 200 దాటింది. వాతావరణం అనుకూలంగా మారిన ఏరియాల్లో రేట్లు కొద్దిగా తగ్గాయి. హమ్మయ్య, ఇక కూరల్లోకి టమాటాలు కొనొచ్చు అనుకునే లోపే ఉల్లిపాయలు లైన్‌లోకి వచ్చాయి. ఇప్పుడు, ఉల్లి రేటు (Onion Price In India) కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయల ధర రూ. 25 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. ఈ రేటు రెట్టింపు పైగా పెరిగే సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయి. ఇంకా చదవండి


రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - పోకో ఎం6 ప్రో 5జీ వచ్చేసింది


పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పోకో ఎం6 ప్రో 5జీ పని చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. పోకో ఫోన్లలో ఇదే అత్యంత భారీ డిస్‌ప్లే అని కంపెనీ అంటోంది. ఇంకా చదవండి


పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా - అబ్బాయి పేరేంటో తెలుసా?


గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ (Ileana D'cruz) తల్లి అయ్యారు. ఆమె గర్భవతి అనే సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా గర్భం (బేబీ బంప్) ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆవిడ సగర్వంగా ఎప్పుడో ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆవిడ తల్లి అయ్యారు. ఇంకా చదవండి


ఆగ్రహంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు - మైత్రికి మాస్ వార్నింగ్!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు కోపం వచ్చింది. బ్యానర్లతో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్ల మీద ధర్నా తరహాలో అభిమానులు అంతా ఏకం కావడమే కాదు... సోషల్ మీడియా వేదికగా కూడా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. అభిమాన కథానాయకుడు నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie) చిత్ర బృందంపై మండి పడుతున్నారు. ఎందుకు? ఏమిటి? అని వివరాల్లోకి వెళితే... ఇంకా చదవండి


ఇషాంత్ శర్మ ఫేస్ చేసిన టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? - భారత బౌలర్ ఏమన్నాడంటే?


భారత టెస్టు చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ముందంజలో ఉంటాడు. ఇషాంత్ శర్మ టెస్టుతో పాటు వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇషాంత్ శర్మ టెస్టుల్లో ఎక్కువ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇషాంత్ శర్మ ఏ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడంలో చాలా కష్టపడ్డారు? ఈ ప్రశ్నకు స్వయంగా ఇషాంత్ శర్మ సమాధానం ఇచ్చాడు. ఇంకా చదవండి