గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ (Ileana D'cruz) తల్లి అయ్యారు. ఆమె గర్భవతి అనే సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా గర్భం (బేబీ బంప్) ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆవిడ సగర్వంగా ఎప్పుడో ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆవిడ తల్లి అయ్యారు. 


ఐదు రోజులు ఆలస్యంగా...
ఆగస్టు 1న అబ్బాయి జన్మించినట్లు ఇలియానా తెలిపారు. పండంటి మగబిడ్డ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా! సాధారణంగా చిన్నారి పిల్లల ఫోటోలను ఎవరూ షేర్ చేయరు. దిష్టి తగులుతుందని! కానీ, ఇలియానా అలా కాదు... అబ్బాయి ఫోటోలను బయట పెట్టేశారు! అబ్బాయి పేరు కూడా చెప్పారు. 


కోవా ఫోనిక్స్ డోలాన్... సన్నాఫ్ ఇలియానా!  
Ileana Baby Boy Named Koa Phoenix Dolan : తన కుమారుడికి 'కోవా ఫోనిక్స్ డోలాన్' అని పేరు పెట్టినట్లు ఇలియానా తెలిపారు. ''ఈ ప్రపంచంలోకి మా చిన్నారి కుమారుడికి స్వాగతం పలకడానికి మేం ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి'' అని ఇలియానా పేర్కొన్నారు.


Also Read : ఆగ్రహంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు... మైత్రికి మాస్ వార్నింగ్, ఈ రోజుతో వదిలిపెట్టమని హెచ్చరిక





 
హిందీ హీరోయిన్లు హ్యూమా ఖురేషి, నర్గిస్ ఫక్రి, అతియా శెట్టితో పాటు పలువురు ఇలియానాకు శుభాకాంక్షలు చెప్పారు.     


డెలివరీకి ఐదు రోజుల ముందు హింట్ ఇచ్చిన ఇలియానా?
ఇలియానా జూలై 26న ఓ మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేశారు. అందులో నిండు గర్భంతో ఆమె కనిపించారు. దాంతో 'డెలివరీ డేట్ దగ్గర పడిందా?' అని కొందరు డౌట్స్ వ్యక్తం చేశారు. ఇలియానా కూడా తన డెలివరీ గురించి ఐదు రోజుల ముందు ఆ విధాంగా హింట్ ఇచ్చారన్నమాట.


Also Read 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!  



కట్రీనాకు కాబోయే మరదలు ఇలియానా!
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో? ఏమో? బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ (Sebastian Laurent Michel)కు ఇలియానా దగ్గర అయ్యారు. 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రాంలో కట్రీనా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 


తాను గర్భవతి అని ఇలియానా ప్రకటించినప్పుడు... 'పెళ్లి కాకుండా తల్లి ఎలా అవుతున్నావు? ఇది సంప్రదాయమేనా?' అని ఆమెను కొందరు ప్రశ్నించారు. 'నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు?' అంటూ కొంత మంది దారుణంగా, చాలా నీచంగా కామెంట్స్ చేశారు. ఆ విమర్శలను ఇలియానా పట్టించుకోలేదు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial