వైనాట్ 175 సాధ్యమే, త్వరలో రెండు కొత్త కార్యక్రమాలతో జనాల్లోకి - సీఎం జగన్


అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత మనం గేర్‌ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జులతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు, అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు అని వైఎస్ఆర్ సీపీ నేతలతో అన్నారు. ఇంకా చదవండి


సీఎం కేసీఆర్ కు అస్వస్థత


తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఐదుగురు వైద్యుల బృందం వైద్యం ఆయనకు చికిత్స అందిస్తోంది. తన తండ్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వారం రోజుల నుంచి జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లోనే డాక్టర్లు కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారని.. త్వరగానే ఆయన కోలుకుంటారని డాక్టర్ల బృందం చెప్పినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇంకా చదవండి


ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ, ఇదే చివరి సమావేశమా?


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న కేబినెట్ భేటీ నిర్వహించనుంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడం వివాదానికి దారి తీసింది. దీనిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా తమిళిసై టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారని, అలాంటి వారిని గవర్నర్‌గా నియమించవచ్చా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా చదవండి


డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమేనా ?


కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల  బిల్లును తీసుకు వచ్చింది. ఈ సందర్భంగా అందులో పెట్టిన  షరతు... నియోజకవర్గాల పునర్విభజన తరవాత అమలు చేయడం.  దీంతో  ఈ నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చింది.   ఇదే జరిగితే  దక్షిణాది పరిస్థితి ఏమిటన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి.  దేశంలో జనాభా పెరిగిపోతోందని  జనాభా నియంత్రణను మన ప్రభుత్వాలు చేపట్టాయి. జనాభాను నియంత్రించిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రజలు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చదవండి


జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ, ఆలయం ఎప్పటికి పూర్తవుతుందంటే?


అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ ఉండవచ్చని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజు అయినా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఈ భవ్య మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అవుతుందని నిర్మాణ కమిటీ ఛైర్‌ పర్సన్ తెలియజేశారు. ఇంకా చదవండి


కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?


2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ (2023 Hyundai i20 N Line Sale) కారు ఇప్పుడు భారతదేశంలో సేల్‌కు అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్ చేసిన మోడల్ పరిధిలో ఎన్6, ఎన్8 రెండు ట్రిమ్‌లు ఉన్నాయి. ఇవి రెండూ 1.0 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతాయి. దీంతోపాటు కొత్త 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీతో సహా రెండు గేర్‌బాక్స్‌ల ఆప్షన్‌ను కూడా ఇవి పొందుతాయి. ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎం వద్ద 120 పీఎస్ శక్తిని, 1,500 నుంచి 4,000 ఆర్పీఎం మధ్య 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చదవండి


దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్


టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో 'యానిమల్'(Animal) అనే మోస్ట్ వైలెంట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో షాహిద్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇప్పుడు రణబీర్ కపూర్‌ను ఊర మాస్ రేంజ్ లో చూపించడానికి సిద్ధమయ్యాడు సందీప్ వంగ. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఆసక్తి అంతా కాదు. ఇంకా చదవండి


ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి


కొందరు హీరోహీరోయిన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వారు ఆఫ్ స్క్రీన్ కూడా కపుల్ ఏమో అని ప్రేక్షకులు అనుకుంటారు. రూమర్స్ మొదలవుతాయి. అందులో కొన్ని రూమర్స్ నిజమవుతాయి కూడా. కానీ అలా ప్రేమించుకోవడం మొదలుపెట్టిన ప్రతీ హీరోహీరోయిన్ ప్రయాణం పెళ్లి వరకు వెళ్లే ఛాన్స్ ఉండదు. కొందరు రిలేషన్‌షిప్ మొదట్లోనే విడిపోతే.. కొందరు మాత్రం తమ ప్రేమ గురించి అందరికీ అనౌన్స్ చేసిన తర్వాత విడిపోతారు. అలా విడిపోయిన వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందనా కూడా ఒకరు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత తనతో విడిపోయి పూర్తిగా కన్నడ ఇండస్ట్రీకి చాలాకాలం వరకు దూరంగా ఉంది రష్మిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం రష్మికకు తనతో ఎలాంటి రిలేషన్ ఉంది అని బయటపెట్టాడు రక్షిత్. ఇంకా చదవండి


ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్


ఆసియా కప్‌ - 20‌23లో సూపర్ -4లోనే నిష్క్రమించి కీలక ఆటగాళ్లు గాయాలపాలైన  రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఉన్న  బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయి. తాజా, మాజీ సారథులు షకిబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.  తాను వన్డే వరల్డ్ కప్‌లో  ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని తమీమ్  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు  చెప్పగా ఆ ప్రతిపాదనకు అంగీకరించేదిలేదని అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని షకిబ్ అల్ హసన్ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇంకా చదవండి


భారత్‌ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం


ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్‌ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్‌ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఆతిథ్య చైనాను వెనక్కి నెట్టింది. హృదయ్‌ చెడ్డా, దివ్యకృతి సింగ్‌, అనుష అగర్వాల, సుదీప్తి హజేలాతో కూడిన జట్టు 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (204.882 పాయింట్లు), హాంకాంగ్‌ (204.852 పాయింట్లు)ను రజతం, కాంస్యానికి పరిమితం చేసింది. ఇంకా చదవండి