నాన్ స్టిక్ పాన్ వచ్చిన తర్వాత ఇనుము కళాయి వాడకం చాలా మంది తగ్గించేశారు. నాన్ స్టిక్ అయితే వంట త్వరగా అయిపోతుందని అనుకుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇనుము పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు కూడా పెరుగుతాయని మీకు తెలుసా? ఆహారం ఇనుము పాత్రల్లో చేసినప్పుడు పాత్ర నుంచి కొంత ఇనుము గ్రహిస్తుంది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పరిశోధకులు 20 రకాల ఆహారాలని ఇనుము పాత్రల్లో వండించారు. ఆ వంటలలో ఐరన్ ఎంత వరకు ఉందనేది పరిశీలించారు. ఐరన్ పాత్రల్లో వండినప్పుడు దాదాపు 90 శాతం ఆహారాలలో ఐరన్ ఉన్నట్టు కనుగొన్నారు.
మరొక పరిశోధన ప్రకారం ఐరన్ వంట పాత్రలు ఉపయోగించి వంట చేస్తే పిల్లల్లో ఇనుము లోపం, రక్తహీనత ప్రమాదాలు తగ్గినట్టు తేలింది. కానీ ఐరన్ పాత్రల్లో ఆమ్ల ఆహారాలు వండకూడదు. ఎందుకంటే ఇది ఆహారంలోని పోషకాలని నాశనం చేస్తుంది. ఇనుప కడాయిలో వంట చేయడం వల్ల ఆహారం ఐరన్ తో సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి ఐరన్ చాలా కీలకమైన పోషకం. ఇది కణాలని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐరన్ లోపం వల్ల మైకం, అలసట, స్లీప్ అప్నియా మరికొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు.
ఇనుము పాత్రల్లో వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
⦿ ఐరన్ పాత్రల్లో ఆమ్ల పదార్థాలు వండకూడదు. నిమ్మ, వెనిగర్ వంటి పదార్థాలు ఉన్న వాటిని వండితో వంట రుచి చెడిపోతుంది.
⦿ వంట చేసిన తర్వాత ఆహారాన్ని ఇనుము పాన్ మీద ఉంచుకూదడు. దాన్ని ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఆహార నాణ్యత చెడిపోతుంది. ఐరన్ పాన్ చాలా కాలం పాటు వేడిని నిలుపుకుని ఉంటుంది. అందుకే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆహారం ఉడుకుతూ ఉంటుంది. అతిగా ఉడకబెట్టడం వల్ల ఆహారంలోని పోషకాలు నాశనం అవుతాయి.
⦿ ఐరన్ పాత్ర ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉండాలి. ఎప్పుడో ఒకసారి వాడితే ఆహారం దానికి అతుక్కుపోయే అవకాశం ఉంది. అందుకే వాడుకునే ముందు పాన్ పై కొద్దిగా నూనె బ్రష్ చేసి బాగా వేడి చేయాలి.
⦿ ఐరన్ తవా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వాటిని తోముకునేటప్పుడు హార్డ్ గా ఉండే స్క్రబ్ ఉపయోగించకూడదు. సున్నితంగా కడగాలి. గట్టిగా రుద్దటం వల్ల తర్వాత చేసే వంటలు వండడం కష్టంఅవుతుంది. అందుకే వాటిని తోమడానికి ముందు దానిపై కాస్త ఉప్పు, బేకింగ్ సోడా వేసి రుద్ది ఆ తర్వాత శుభ్రంగా కడగడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నిర్లక్ష్యం వద్దు - ఈ స్లీపింగ్ కిల్లర్ వల్ల స్ట్రోక్, గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువే!